ప్రముఖ ఆలయం కేదార్‌నాథ్‌లో పూజలు అనంతరం మోదీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు దేవుడ్ని ఏమీ కోరలేదన్నారు. కేదారినాథ్ తనకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారన్నారు. అందుకే ఆయనను మరేమీ ఇవ్వాలని కోరలేదని భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఎన్ని ఆలయాలు దర్శించినా తాను ఎప్పుడూ భగవంతుడ్ని ఏం కోరలేదన్నారు. కేవలం మానసిక ప్రశాంతత, ధ్యానం కోసమే కేదార్‌నాథ్‌కు వచ్చానన్నారు. ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న మోదీ జ్యోతిర్లంగ క్షేత్రమైన కేదారినాథ్‌ను దర్శించుకున్న అనంతరం అక్కడి పవిత్ర ధ్యాన గుహలో ధ్యానముద్రలో ఆదివారం ఉదయం వరకు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడన్నారు మోదీ. కష్టించి పనిచేసే సభ్యుల బృందం దొరకడం ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రజలందరికీ యావత్ భారత దేశం సందర్శించే శక్తి రావాలని కోరుకుంటున్నారు.
కేదార్‌నాథ్ దర్శనం అనంతరం ఆయన బద్రీనాథ్‌కు వెళ్లారు. అక్కడ నారాయణుడికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ ఆధ్యాత్మిక బాటపట్టారు. బద్రీనాథ్ ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తుల్ని మోదీ అభివాదం చేశారు.ప్రధాని పర్యటనను దృష్టిలో పెట్టుకొని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు మోదీ ఆధ్యాత్మకి పర్యటనపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిపోయినా.. కేదార్‌నాథ్ యాత్రను మోదీ పరోక్షంగా అందుకోసం వాడుకున్నారని తృణమూల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓటర్లను ప్రభావితం చేయడానికే ఆయన కేదార్‌నాథ్ యాత్ర చేపట్టారని ఆరోపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kedarnath, Narendra modi, National News, Pm modi