Home /News /politics /

I DONT THINK ANY NATIONAL PARTY LEADER WORKS AS HARD AS AMIT SHAH SAYS NARENDRA MODI MS

అమిత్ షా కష్టం మామూలుది కాదు.. ఆయనలా మరెవరూ కష్టపడలేరు : మోదీ

న్యూస్18 ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

న్యూస్18 ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

Narendra Modi on Amit Shah Hard Working Nature : అమిత్ షా కష్టపడే తత్వం వల్ల బీజేపీకి చాలా విధాలుగా మేలు జరుగుతోందని మోదీ అన్నారు. పార్టీలో కింది స్థాయి సమస్యలను పరిష్కరించడంలో.. కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయడంలో అమిత్ షా ఎప్పుడూ ముందుంటారని చెప్పారు.

ఇంకా చదవండి ...
    భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై మోదీ ప్రశంసలు కురిపించారు. బెంగాల్‌లో బీజేపీ 23 ఎంపీ స్థానాలు గెలుస్తుందన్న అమిత్ షా ధీమాపై మోదీని ప్రశ్నించగా.. అమిత్ షా పనితనాన్ని ఆయన కొనియాడారు.

    బెంగాల్‌లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పడానికి నేను నంబర్స్ ప్రస్తావించను. కానీ ఇప్పుడున్న అందరు నేతల కంటే అమిత్ షా అత్యంత ఎక్కువగా శ్రమించే నేత. నా క్యాంపెయిన్‌కు మీడియా కవరేజ్ లభిస్తుంది కానీ ఆయనకు కవరేజ్ ఉండదు. నేననుకోవడం.. దేశంలో మరే జాతీయ పార్టీ నేత అమిత్ షా ‌లాగా ఏడాది పొడవునా కష్టపడడు. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, బీజేపీ శ్రేణులతో అమిత్ షా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు.
    ప్రధాని నరేంద్ర మోదీ


    అమిత్ షా కష్టపడే తత్వం వల్ల బీజేపీకి చాలా విధాలుగా మేలు జరుగుతోందని మోదీ అన్నారు. పార్టీలో కింది స్థాయి సమస్యలను పరిష్కరించడంలో.. కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయడంలో అమిత్ షా ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. కాబట్టి అమిత్ షా పట్ల తాను ఎల్లప్పుడూ అత్యంత నమ్మకంతో ఉంటానని వెల్లడించారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Amit Shah, Lok Sabha Election 2019, Narendra modi, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు