‘మూడు రాజధానులపై చిరంజీవి యూటర్న్’...

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇవ్వలేదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: December 22, 2019, 9:05 PM IST
‘మూడు రాజధానులపై చిరంజీవి యూటర్న్’...
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇవ్వలేదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి పేరుతో ఉన్న ఓ లెటర్ హెడ్ మీద తాను మూడు రాజధానులకు మద్దతిస్తున్నట్టుగా కానీ, వ్యతిరేకిస్తున్నట్టుగా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే, ఈ లెటర్ హెడ్‌ను ఓ సారి పరిశీలిస్తే.. ఇది ఫేక్ న్యూస్‌గా కనిపిస్తోంది. చిరంజీవి లెటర్‌హెడ్‌ మీద ఈ సందేశాన్ని ప్రింట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే, ఈ ఫేక్‌న్యూస్‌ను ఎవరు క్రియేట్ చేశారనేది సందేహంగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఫేక్ ప్రెస్ నోట్ బారిన పడ్డాడు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పవన్ కళ్యాణ్ కాకినాడ రైతు దీక్షకు హాజరుకానందుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు జనసేన లెటర్ హెడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది. అయితే, అది వైసీపీ వాళ్లే చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

చిరంజీవి పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్ లెటర్


అసలు చిరంజీవి ఏమన్నారు?

పరిపాలన వికేంద్రీకణతో అభివృద్ధి సాధ్యమని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారని చిరు కొనియాడారు. రాష్ట్రం విషయంలో నిఫుణుల కమిటీ సిఫారసులు సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయన్నారు.ఇప్పటికే రాష్ట్రం మూడు లక్షలకోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అమరావతిని నిర్మించాలంటే మరో లక్ష కోట్లు అవసరం పడతాయన్నారు. అమరావతిని నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికార కేంద్రీకరణ వల్ల ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిన్నాయన్నారు చిరంజీవి. ఉమ్మడి ఏపీలో పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 22, 2019, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading