‘నీ భార్య ట్వింకిల్ ట్విట్టర్ కూడా నేను చూస్తాను’ అక్షయ్‌తో ప్రధాని మోదీ

’ట్వింకిల్ ఖన్నా నాపై మండిపడుతూ చేస్తున్న ట్వీట్లను చూసి.. నీ కాపురం చల్లగా ఉంటుంది’అని అనుకుంటూ ఉంటానన్నారు మోదీ.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: April 24, 2019, 12:52 PM IST
‘నీ భార్య ట్వింకిల్ ట్విట్టర్ కూడా నేను చూస్తాను’ అక్షయ్‌తో ప్రధాని మోదీ
నరేంద్ర మోదీ, అక్షయ్ కుమార్
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీతో ...బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అక్షయ్ అడిగిన ఓ ప్రశ్నకు ప్రధాని మోదీ చాలా చమత్కారంగా సమాధానాలిచ్చారు. మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ చెక్ చేస్తారన్న వార్తలకు మోదీ నవ్వుతూ బదులిచ్చారు. డైలీ తాను ట్విట్టర్ ఎకౌంట్‌ను చెక్ చేస్తానన్నారు. నీతో పాటు నీ భార్య నాపై చేసిన ట్వీట్లను కూడా చూస్తాంటానని అక్షయ్‌తో చెప్పారు. ‘ట్వింకిల్ ఖన్నా నాపై మండిపడుతూ చేస్తున్న ట్వీట్లను చూసి.. నీ కాపురం చల్లగా ఉంటుంది’అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ట్వింకిల్ తన కోపాన్నంతా నాపై చూపించింది కదా... హమ్మయ్య.. అక్షయ్ ఫ్యామిలీలో ఇక ఏ గొడవ ఉండదని అనుకుంటూ ఉంటానని నవ్వులు పూయించారు మోదీ. మోదీ ఈ వ్యాఖ్యలు చేస్తుంటూ అక్షయ్ కూడా చిరునవ్వులు చిందించారు. ట్వింకుల్ ఖన్నా తాతయ్యను తను గతంలో కలిశానని ఈ సందర్భంగా తెలిపారు మోదీ. గుజరాత్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు. పేద ప్రజలకు పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారమన్నారు. దానికి సంబంధింది అనేకమందిని కలిసి చందాలు సేకరించేవారమన్నారు. ఆ సమయంలో ట్వింకిల్ ఖన్నా తాతయ్య చనుభాయ్ తనను కలిశారన్నారు. అనేక విషయాలపై ఆయన తనతో చాలాసేపు మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మోదీకి సోషల్ మీడియాపై ఆయనపై వస్తున్న కామెంట్లను చూపించారు అక్షయ్. సోషల్ మీడియాలో తనపై వస్తున్న జోకుల్ని పాజిటివ్‌గా తీసుకుంటానన్నారు మోదీ. ఆ కామెంట్స్‌లో మోదీ కన్నా ఎక్కువగా క్రియేటివిటీనే తాను చూస్తుంటానన్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కామన్ మ్యాన్ ఏం అనుకుంటున్నాడో మనకు తెలుస్తుందన్నారు. ఒకవేళ మనం వాటిపై స్పందిస్తే వారికి మజా వస్తుందన్నారు. తాజాగా జరిగిన మన మీటింగ్‌పై కూడా సోషల్ మీడియాలో జోకులు పేల్చేందుకు నెటిజన్లంతా రెడీగా ఉన్నారన్నారని అక్షయ్ అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు.First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు