Tamilnadu Politics : పార్టీకి నేనే ప్రధాన కార్యదర్శిని.. స్పీడ్ పెంచిన శశికళ...

(Image-Twitter)

Tamilnadu Politics : అన్నాడిఎంకే పార్టీ నుండి బహిష్కరించబడ్డ వికె శశికళ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.. అన్నాడిఎంకేకు తానే ప్రధాన కార్యదర్శినంటూ సొంత శశికళ ప్రకటించుకున్నారు. ఆపార్టీ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆవిష్కరించిన శిలాఫలకంలో ఆమె ప్రధాన కార్యదర్శి అంటూ పేర్కొన్నారు.

 • Share this:
  తమిళనాడులోని ( Tamilnadu ) అన్నాడిఎంకెలో ( AIADMK ) మరో కొత్త వర్గం రానుంది. ఇప్పటికే ఆ పార్టీ పగ్గాల కోసం ఇద్దరు నేతలు పోటి పడుతుండగా ఇప్పుడు తాజాగా స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఆదివారం అన్నాడిఎంకే 50 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పార్టీకి తానే ప్రధాన కార్యదర్శినంటూ ఆమె చాటుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె వ్యవహరం పై ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది.

  ఈ క్రమంలోనే ఆమె నేతృత్వంలోనే చైన్నైలోని ( Chennai ) టీనగర్‌లోఎంజీఆర్ స్మారక వేడుకలు జరిగాయి. ఈ సంధర్భంగా ఆమె స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. మరోవైపు అన్నాడిఎంకే పార్టీ జెండాతో కూడిన కారులో ఆమె ప్రయాణించారు. అనంతరం ఎంజీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, మాజీ సిఎం జానకి రామచంద్రన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పార్టీని పటిష్టపరించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గతంలో జయలలిత వలే పార్టీ పునర్‌వైభవంలోకి తీసుకురావాలని ఆమె కోరారు.

  ఇది చదవండి : సోదరి ప్రియున్ని హత్య చేసి .. ఆ తర్వాత శవాన్ని నేరుగా స్టేషన్‌కే తీసుకెళ్లాడు.. ఆ తర్వాత...?


  కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగుళూరులో ( Bengaluru ) జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె తొలిసారిగా దివంగత పార్టీ అధినేత్రి జయలలిత స్మారకాన్ని సందర్శించారు. రాజకీయాల్లోకి (politics ) తిరిగి రావడానికి ఆమె సుముఖత చూపుతున్నట్లుగా, శశికళ తన స్మారక చిహ్నం వద్ద పార్టీలో ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయాన్ని తన మాజీ ముఖ్యమంత్రికి చెప్పారని, 'పార్టీకి మంచి భవిష్యత్తు గురించి ఆమెకు హామీ ఇచ్చారు' అని చెప్పారు.

  ఇది చదవండి : హైదరాబాద్‌లో టీ బాగా కాస్లీ గురు.. కప్పు చాయ్ 1000 రూపాయలట..!


  జయలలిత స్మారకం వద్ద కన్నీటి నివాళులు అర్పించిన తర్వాత, మీడియాతో శశికళ మాట్లాడుతూ, జయలలిత నా జీవితంలోకి వచ్చినప్పుడు విడదీయరాని బంధం ఏర్పడిందని.... ఇక్కడ నేను గత ఐదేళ్లలో అనుభవించిన అన్ని బాధల నుండి ఉపశమనం పొందాను. నేను ఇప్పటి వరకు ఏమి జరిగిందో ఆమెకు చెప్పాను మరియు పార్టీకి మంచి భవిష్యత్తును ఆమెకు హామీ ఇచ్చాను. అమ్మ మరియు అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ పార్టీని మరియు మా కార్యకర్తలను కాపాడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని చెప్పింది.. '

  ఇది చదవండి : నొప్పులకు మందులు ఇస్తానని ఆమెను గుడిసెలోకి తీసుకువెళ్లాడు.. ఆగకుండా.. ఆమెపై... !


  అక్టోబర్ 27 న తంజావూరులో పార్టీ కార్యకర్తలతో శశికళ సమావేశమవుతారని, ఆమె సన్నిహితుడు మీడియాకు తెలిపారు. మరో మూడు రోజుల్లో ఆమె తిరునల్వేలి, తెంకాసి, రామనాథపురంలో జరిగే పార్టీ సమావేశాల్లో ప్రసంగించనున్నట్టు చెప్పారు...
  Published by:yveerash yveerash
  First published: