సారీ చెప్పేందుకు సిద్ధం.. అమరావతిపై చంద్రబాబు వ్యాఖ్యలు

అమరావతిలో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. అమరావతి ప్రాజెక్టు తప్పు అని ఒకవేళ ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

news18-telugu
Updated: December 5, 2019, 3:26 PM IST
సారీ చెప్పేందుకు సిద్ధం.. అమరావతిపై చంద్రబాబు వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు
  • Share this:
అమరావతి నుంచి ఏపీ రాజధానిని తరలిస్తారని కొంత కాలంగా ఏపీలో ప్రచారం జరుగుతోంది. అమరావతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిపుణల కమిటీని నియమించింది. ఆ కమిటీ రిపోర్టుపైనే రాష్ట్ర రాజధాని భవితవ్యం ఆధారపడి ఉంది. మంత్రులు తలో మాట మాట్లాడుతన్నా.. సీఎం జగన్ మాత్రం అమరావతిపై మౌనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అమరావతిపై మాజీ సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్యే బాలకృష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్‌, ఆర్‌ఎస్‌పీ నుంచి జానకి రాములు, ఫార్వర్డ్‌ బ్లాక్‌, లోక్‌సత్తా, ఆమ్‌ ఆద్మీ, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. అమరావతిలో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. అమరావతి ప్రాజెక్టు తప్పు అని ఒకవేళ ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

అమరావతి.. ప్రతి తెలుగు బిడ్డ గర్వించదగ్గర ప్రపంచస్థాయి నగరమని చంద్రబాబు అన్నారు. యువతకు ఉద్యోగాలను ఇచ్చే కల్పవల్లి అని తెలిపారు. రాష్ట్రం, సమాజమే శాశ్వతమని.. వ్యక్తులు శాశ్వతం కాదని స్పష్టం చేశారు. అమరావతిపై వైసీపీ నేతలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని.. ప్రజాచైతన్యం వల్లే అమరావతి నిలబడుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి భావితరాల భవిష్యత్ అని.. ప్రజా రాజధానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు చంద్రబాబు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>