సైన్యాన్ని తయారు చేస్తున్నాం.. అందుకే అసెంబ్లీకి రావట్లే.. రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు..

దేశ రక్షణ కోసం, హిందూ రాష్ట్రం కోసం ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నామని, అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యలే రాజా సింగ్ తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 17, 2019, 4:02 PM IST
సైన్యాన్ని తయారు చేస్తున్నాం.. అందుకే అసెంబ్లీకి రావట్లే.. రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు..
ఎమ్మెల్యే రాజా సింగ్ (ఫైల్)
  • Share this:
దేశ రక్షణ కోసం, హిందూ రాష్ట్రం కోసం ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నామని, అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యలే రాజా సింగ్ తెలిపారు. ఉన్న ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంపై ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు ముందే బెంగళూరులో క్యాంపుకు సంబంధించి ప్లాన్ సిద్ధం చేసుకున్నామని, అటు వెళ్లాల్సి రావడం వల్లే అసెంబ్లీకి రావడం వీలు కాలేదని స్పష్టం చేశారు. ధర్మ రక్షణ, దేశ రక్షణ కోసం ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నామని, హిందు రాష్ట్రం తమ సంకల్పమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సైన్యం కావాలని మొత్తం భారత దేశంలో హిందూ రాష్ట్రం, ధర్మం, దేశ రక్షణ కోసం సైన్యం తయారు చేస్తున్నామని వివరించారు. జాతికి ఉపయోగపడే పనిలో భాగంగా క్యాంప్ 10 రోజుల పాటు ఉంటుందని, ఆ పనితో తాను బిజీగా ఉన్నానని వెల్లడించారు.

మరోవైపు, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సర్దార్ పటేల్ ఫోటోలను పోస్ట్ చేసిన రాజా సింగ్.. ‘ఇదే రోజు 1948లో హైదరాబాద్ సంస్థానం నిజాంల ఇస్లామిక్ పాలన నుంచి విముక్తి పొందింది. సర్దార్ పటేల్‌కు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.


First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>