హోమ్ /వార్తలు /రాజకీయం /

నేను నోబెల్‌కు అర్హుడిని కాదు.. అందుకు నిజమైన అర్హులు ఎవరంటే..: ఇమ్రాన్ ఖాన్

నేను నోబెల్‌కు అర్హుడిని కాదు.. అందుకు నిజమైన అర్హులు ఎవరంటే..: ఇమ్రాన్ ఖాన్

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(File)

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(File)

Imran Khan on Nobel Peace Award : శాంతిని నెలకొల్పేందుకే ఇమ్రాన్ ఉదార నిర్ణయం తీసుకున్నారని.. ఆయనకు నోబెల్ బహుమతిని ఇవ్వాల్సిందేనని అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

  ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నవేళ.. ఎట్టకేలకు ఆయన దీనిపై స్పందించారు. నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని చెప్పారు. తాను అర్హుడిని కాదని చెబుతూనే.. నోబెల్‌కు అర్హులెవరో కూడా చెప్పారు ఇమ్రాన్. కశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిష్కరించి.. శాంతికి, మానవాభివృద్దికి ఎవరైతే మార్గం సుగమం చేస్తారో.. వారు నోబెల్‌కు అర్హులని అభిప్రాయపడ్డారు.


  పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించడంతో ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశమంతా ప్రశంసలు కురిపించింది. శాంతిని నెలకొల్పేందుకే ఇమ్రాన్ ఉదార నిర్ణయం తీసుకున్నారని.. ఆయనకు నోబెల్ బహుమతిని ఇవ్వాల్సిందేనని అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ దానిపై తాజాగా స్పందించారు.


  ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్‌తో శాంతి చర్చలకు తాను సిద్దమంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే.. మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరి నచ్చకనే ఆ దేశంతో చర్చలకు దూరంగా ఉంటోంది.
  First published:

  Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir, Narendra modi, Nobel Prize, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు