పీసీసీ చీఫ్ పదవిపై ఆశలేదు..ప్రజలే ముఖ్యం: కోమటిరెడ్డి

ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి స్పందించారు. తనకు పీసీసీ పదవిపై ఆశలేదని..పదవుల కంటే ప్రజలే ముఖ్యమని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: June 5, 2019, 6:53 PM IST
పీసీసీ చీఫ్ పదవిపై ఆశలేదు..ప్రజలే ముఖ్యం: కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 5, 2019, 6:53 PM IST
తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగిపోతారని..జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టి పెడతారని ప్రచారం జరుగుతోంది. రేస్‌లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తనకు పీసీసీ పదవిపై ఆశలేదని...పదవుల కంటే ప్రజలే ముఖ్యమని స్పష్టంచేశారు.

పీసీసీ అధ్యక్ష పదవిపై నాకు ఆశ లేదు. దాని కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని భువనగిరి ప్రజలు నాకు ఇచ్చారు. నాకు ప్రజలే ముఖ్యం. భువనగిరి ప్రజలకు సేవచేస్తా. పీసీసీ అధ్యక్ష పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే వారికే ఇవ్వండి. పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నా శుభాకాంక్షలు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భవనగిరి ఎంపీ


మరోవైపు టీపీసీీసీ అధ్యక్ష పదవి నుంచి నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ తప్పుకుంటున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. అందులో నిజం లేదని, పీసీసీ చీఫ్ మార్పుపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు కాంగ్రెస్‌కు రాలేదని.. దానిపై విశ్లేషించుకుంటామని తెలిపారు.

First published: June 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...