నాతో నాకే పోటీ.. 2014 నుంచి బాగా పనిచేస్తున్నానన్న నరేంద్ర మోదీ

భారత దేశ ప్రధానమంత్రిగా నరేందర్ దామోదర్ దాస్ మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. (BJP/Twitter)

‘నా ప్రత్యర్థి ఎవరని నన్ను అడిగారు. నాతో నాకే పోటీ. 2014 నుంచి నాకంటే నేను మెరుగ్గా పనిచేస్తున్నానని గర్వంగా చెప్పగలను.’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

  • Share this:
    ‘ఎన్డీయేపక్ష నేతగా నన్ను మీరు ఎన్నుకుని ఉండొచ్చు. కానీ నేను కూడా మీలో ఒకడినే. మనమంతా సమానం.’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీయే భాగస్వామ్యపక్షాల భేటీ జరిగింది.బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. నరేంద్ర మోదీని ఎన్డీయే భాగస్వామ్యపక్షాల తరఫున తమ నేతగా ఎన్నుకున్నాయి. అనంతరం కొత్త ఎంపీలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘నా ప్రత్యర్థి ఎవరని నన్ను అడిగారు. నాతో నాకే పోటీ. 2014 నుంచి నాకంటే నేను మెరుగ్గా పనిచేస్తున్నానని గర్వంగా చెప్పగలను.’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం తన మీద బాధ్యత మరింత పెంచిందన్నారు. ప్రజలు తమ పనితీరును చూసి మళ్లీ అవకాశం ఇచ్చారని, ఈసారి మరింత మెరుగ్గా పనిచేయాలన్నారు. 2019 ఎన్నికలు ప్రజల మధ్య ఉన్న అన్ని అడ్డుగోడలను కూల్చి, వారి మనస్సులను ఏకం చేశాయని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినందుకు అందరికీ గర్వంగా ఉంటుందని, అయితే, మనకు ఓటేసిన వారి కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేశారని, అలాగే, మహిళా ఎంపీలు కూడా ఈసారి ఎక్కువ మందే ఎన్నికయ్యారని మోదీ అన్నారు.
    First published: