హైదారాబాద్ లంగర్ హౌస్‌లో భారీగా నగదు పట్టివేత

Lok Sabha Elections 2019 : ఎన్నికల సందర్భంగా జరిపే తనిఖీల్లో వేల రూపాయలు దొరికే రోజులు పోయాయి... ఇప్పుడు లక్షలు, కోట్లే దొరుకుతున్నాయి.

news18-telugu
Updated: April 9, 2019, 11:18 AM IST
హైదారాబాద్ లంగర్ హౌస్‌లో భారీగా నగదు పట్టివేత
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
  • Share this:
ఎన్నికల వేళ రాజధాని హైదరాబాద్‌లో డబ్బు భారీగా పట్టుబడుతోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల భారీగా నగదు దొరుకుతుంది. పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తుండంతో బ్లాక్ మనీ బయటపడుతోంది. తాజాగా లంగర్ హౌస్‌లో భారీగా నగదు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీల్లో సుమారు 2.4 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చేస్తున్న తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది. ఓటర్లను పంచేందుకు తీసుకువెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. నిన్న నారాయణగూడలో రూ. 8కోట్లు అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బంజారహిల్స్‌లో కూడా భారీగా నగదును గుర్తించారు పోలీసులు. . వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు... బంజారాహిల్స్‌లో తనిఖీలు చేస్తుంటే...కారులో రూ.కోటి గుర్తించారు.

ఎన్నికల సందర్భంగా జరిపే తనిఖీల్లో వేల రూపాయలు దొరికే రోజులు పోయాయి... ఇప్పుడు లక్షలు, కోట్లే దొరుకుతున్నాయి.ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, మద్యం తరలించే అవకాశం ఉండటంతో వాహనాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. అనధికారికంగా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. అంతకుముందు మలక్ పేటలోనూ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న 34 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవికూడా చదవండి:

మహిళా అనుచరుల గదుల్లో తనిఖీలు... బస్టాండ్‌లో రేణుకా చౌదరి ధర్నాతెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్
First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు