జగన్ కోర్టుకు వెళ్తారా... లేదా? నేడు తేల్చనున్న సీబీఐ కోర్టు

వైఎస్ జగన్

Jagan Cases : అసలే ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్న సీఎం జగన్... తాను కోర్టుకు వస్తే... అనవసరపు ఖర్చులు అవుతాయంటున్నారు. జగన్ నాటకాలాడుతున్నారంటున్న సీబీఐ... కోర్టుకు రాకపోతే... సాక్ష్యల్ని ప్రభావితం చేస్తారంటోంది. మరి కోర్టు ఇవాళ ఏం చెబుతుంది?

 • Share this:
  AP News : ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఐతే... తాను ఏపీ సీఎం అయినందువల్ల చాలా పనులున్నాయనీ, పైగా తాను హాజరైతే... అనవసరపు ఖర్చులు అవుతాయనీ కోర్టుకు తెలిపిన జగన్... ఈ వ్యక్తిగత హాజరు నుంచీ తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై ఇవాళ సీబీఐ కోర్టు ఏం చెబుతుందన్నది రాజకీయంగా ఏపీలో ఆసక్తి కలిగిస్తోంది. జగన్ తనకు బదులుగా తన లాయర్ హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. సీఎం హోదాలో ఉన్న తాను... ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వస్తే... తనకు సెక్యూరిటీ, ప్రోటోకాల్ వంటి అంశాలకు ఒక్క రోజుకు రూ.60 లక్షలు అవుతాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి... ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని అన్నారు.

  జగన్‌పై తీవ్ర ఆర్థిక నేరాల అభియోగాలు ఉన్నాయనీ... ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని అరెస్టు చేశామనీ, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని.. అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచీ మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తరపు లాయర్ వాదించారు.

  ఇదివరకు ఇదే అంశంపై రెండుసార్లు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారు. రెండుసార్లూ కోర్టు పిటిషన్లను కొట్టివేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా జగన్‌కు వ్యతిరేక తీర్పే వచ్చింది. అలా కుదరదని హైకోర్టు కూడా చెప్పింది. మళ్లీ జగన్ ఇదే అంశంపై సీబీఐ కోర్టుకు వెళ్లడాన్ని సీబీఐ తరపు లాయర్లు తప్పుపడుతున్నారు. హైకోర్టు తీర్పుపై అభ్యంతరం ఉంటే... సుప్రీంకోర్టుకు వెళ్లాలి గానీ... ఇలా మళ్లీ సీబీఐ కోర్టుకు ఎందుకు వెళ్లారన్నది సీబీఐ తరపు లాయర్ వేస్తున్న ప్రశ్న. ఇలా ఆసక్తికర మలుపులు ఉండటంతో... సీబీఐ కోర్టు ఇవాళ ఏం చెబుతుందన్నది హాట్ టాపిక్ అయ్యింది.

   

  Pics : అందాల బ్యూటీ అశ్రితా శెట్టి క్యూట్ పిక్స్

  ఇవి కూడా చదవండి :

  Health Tips : రాత్రి త్వరగా భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


  Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


  Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

  Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

  Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

  First published: