Home /News /politics /

HYDERABAD POLICE DENIED PERMISSION TO SANGA REDDY MLA JAGGA REDYY PROTEST AT HYDERABAD OVER HIS DISTRICT LAND LAYOUTS PROBLEMS PRV MDK

Sanga reddy MLA Jagga reddy: నేడు హైదరాబాద్​లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధర్నా.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు షాక్​ ఇచ్చిన పోలీసులు

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి తన జిల్లా సంగారెడ్డి ప్రజల సమస్యలపై హైదరాబాద్​లో ధర్నా చేయాలని పూనుకున్నారు. ఈ మేరకు ధర్నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే జగ్గారెడ్డికి ప్రభుత్వం షాక్​ ఇచ్చింది.

    గత కొద్దిరోజులుగా సంగారెడ్డి కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy Congress MLA Jaggareddy) పేరు మోగుతోంది. సొంత పార్టీ నేతలపైనే అసంతృప్తి వ్యక్తంచేస్తుండటంతో ఇక పార్టీ మారుతారనే అభిప్రాయం చాలా మందిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి తన జిల్లా సంగారెడ్డి ప్రజల సమస్యలపై హైదరాబాద్ (Hyderabad)​లో ధర్నా చేయాలని పూనుకున్నారు. ఈ మేరకు ధర్నా (Protest)కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులకు (Police) విజ్ఞప్తి చేశారు. అయితే జగ్గారెడ్డికి ప్రభుత్వం షాక్​ ఇచ్చింది.

    ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి రేపు చేయనున్న నిరసన దీక్ష (Protest)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. సంగారెడ్డి నియోజకవర్గం, జిల్లా లోని గ్రామపంచాయతీ పరిధిలో లోని ఇల్లిగల్ లేఔట్, ఇండ్ల నిర్మాణాలను LRS & BRS ద్వారా క్రమబద్దీకరణ చేయాలని ప్రభుత్వని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం తో ధర్నా చౌక్ వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన దీక్ష చేయడానికి పోలీసులను పర్మిషన్ కోరడం జరిగింది. హై కోర్ట్ ఆదేశాల మేరకు ఈ నెల 10 వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించడానికి లేదని పోలీసులు దీక్షకు అనుమతి నిరాకరించారు.

    రేవంత్​పై అసంతృప్తి..

    గత వారం రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ఆ పార్టీలో మరోసారి చిచ్చురేపింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వక పోవడం వెనక అంతర్యం ఏమిటని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏకంగా పార్టీ హైకమాడ్‌కు లేఖ రాశారు..కాగా తాజాగా రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల మధ్య ఈ వైరం చివరకు జగ్గారెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో ఉలికిపాటు మొదలైంది.

    కాగా, తనపై వస్తున్న ఆరోపణలపై జగ్గారెడ్డి కూడా కౌంటర్​ ఇచ్చారు.  ’’పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. నన్ను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా కాంగ్రెస్‌ను వీడాలని నాకు లేదు. నా రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను, ఖండించను. నాతో వీహెచ్, భట్టి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. కానీ ఆ విషయాలు బయటకు చెప్పను. కాంగ్రెస్‌నా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి జాగిరి కాదు. సోనియా జాగిరి. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ ఉంటుంది”  అని గతంలోనే అన్నారు.

    సీఎంకు లేఖ రాశా..

    గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్లాట్‌లను, పర్మిషన్‌లేని ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని గతంలో సీఎంకు లేఖ రాశా. పాత లే అవుట్‌లను రెగ్యులరైజ్ చేయండి.. కొత్త లేఅవుట్ లు చేయకుండా చర్యలు తీసుకోండి అని కోరా. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు. ఈ నెల 8న ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్కులో దీక్ష చేస్తా. కోవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేస్తా. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా దీక్ష చేస్తాను' అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Jagga Reddy, Politics, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు