HYDERABAD PAWAN KALYAN TENSION FOR BHARATIYA JANATHA PARTY LEADERS AHEAD OF NAGARJUNA SAGAR BY POLL IN TELANGANA AS PAWAN SUPPORTS BJP IN ANDHRA PRADESH PRN BK
Pawan Kalyan Vs BJP: బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న పవన్..? రంగంలోకి దిగిన కేంద్ర పెద్దలు..?
ప్రతీకాత్మక చిత్రం
తిరుపతి ఉపఎన్నికలో (Tirupai By Poll) పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) బీజేపీకి మద్దతుగా నిలబడగా.. అదే సీన్ నాగార్జున సాగర్లో రిపీట్ అవవ్వాలని తెలంగాణ బీజేపీ (Telangana BJP) నేతలు కోరుకుంటున్నారు.
ఉప ఎన్నికల్లో బీజేపీకి (Bharatiya Janatha Party) జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) షాక్ ఇవ్వబోతున్నారా? జీహెచ్ఎంసీ ఎన్నికలతో మొదలైన ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ఇప్పుడు తెగదెంపులు దిశగా వెళ్తుందా..? అంటే అవుననే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. ఏపీలో జనసేన, బిజేపీ పొత్తు సరిగానే ఉన్నా.. తెలంగాణలో మాత్రం బెడిసికొట్టిందనే అంటున్నారు. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏర్పడిన దూరం ఇరు పార్టీల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి అది మరింత పెరిగింది. ఈ విభేధాల్లో భాగంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి పవన్ మద్దతు తెలిపారు. అయితే తాజా నాగర్జున సాగర్ ఉప ఎన్నికల్లో జనసేనాని ఎలా వ్యవహారిస్తారనే టెన్షన్ ఇటు బీజేపీ పార్టీ కేడర్ తో పాటు నేతల్లో కూడా నెలకొంది. దీంతో ఇప్పుడు పవన్ ఎలాగైనా మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ కమలదళం నేతలు.
ఇందులో భాగంగానే కిషన్ రెడ్డిని రంగంలోకి దించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పవన్ కు సరైన అభిప్రాయం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై పవన్ తో చర్చించ బాధ్యతను కిషన్ రెడ్డికి కేంద్ర బీజేపీ పెద్దలు అప్పగించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే త్వరలో కిషన్ రెడ్డి పవన్ తో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికలో పార్టీకి మద్దతు ఇవ్వాని కిషన్ రెడ్డి పవన్ ను కోరబోతున్నట్లు సమాచారం.
దీంతో పాటు త్వరలో ఈ ఎన్నికు సంబంధించి కేంద్ర పెద్దలు కూడా పవన్ కి టచ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు బీజేపీ శ్రేణులు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ తరుపున నాగర్జున సాగర్ నుంచి బరిలో నిలిచెందుకు పలువురు పవన్ వద్ద ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. 2019 నల్గొండ ఎంపీ అభ్యర్ధిగా వేముల సతీష్ బరిలో నిల్చుంటే ఆయనకు కేవలం 1100 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే సాగర్ లో తమకు గట్టిపట్టుందని జనసైనికులు వాదిస్తున్నారు. వాస్తవానికి దుబ్బాక ఎన్నికల్లోనే పవన్ వచ్చి ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం నడిచింది. అయితే కొన్ని కారణాలు సమీకరణాలు వలన పవన్ ప్రచారానికి రాలేకపోయారు.
తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇరు పార్టీ మధ్య విభేదాలకు కారణం కావడంతో అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ శ్రేణులపై కాస్త గరం గరం గానే ఉన్నారు పవన్. అయితే ఇప్పుడు బీజేపి పెద్దలు తెరపైకి తీసుకొచ్చిన ఈ చర్చలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి అంటున్నారు పార్టీ శ్రేణులు. ఒక వేళ పవన్ బిజేపీకి మద్దతు తెలపకపోతే తన పార్టీ సాగర్ లో పోటీ చేయడం ఖచ్చితం అని అంటున్నారు పవన్ పార్టీ నేతలు.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పవన్ కల్యాణ్ బీజేపీకి అండగా నిలబడ్డారు. తిరుపతిలో ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. సాగర్లో నేరుగా వచ్చి ప్రచారం చేయకపోయినా.. మద్దతు ప్రకటిస్తే చాలు అనే భావనతో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.