Home /News /politics /

HYDERABAD MUNICIPAL ELECTIONS 2020 ASADUDDIN OWAISI COMES ON BULLET BIKE TO CAST HIS VOTE BA

GHMC Elections 2020: ఓటు వేయడానికి బుల్లెట్‌పై వచ్చిన ఎంపీ

ఓటు వేసేందుకు బుల్లెట్‌పై వచ్చిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ఓటు వేసేందుకు బుల్లెట్‌పై వచ్చిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Hyderabad Municipal Elections 2020 Live Updates: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పాతబస్తీలోని శాస్త్రీపురం పోలింగ్ బూత్‌లో అసదుద్దీన్ ఓటు వేశారు.

    GHMC Elections Voting Updates: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పాతబస్తీలోని శాస్త్రీపురం పోలింగ్ బూత్‌లో అసదుద్దీన్ ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ అభివ‌ృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు హైదరాబాద్‌‌లోని ప్రతీ ఓటరు ఇంటి నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబట్టి ప్రధానంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అసదుద్దీన్ అప్పుడప్పుడు ఇలా బుల్లెట్ మీద కనిపిస్తూ ఉంటారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు కూడా ఒకటి, రెండు సార్లు బుల్లెట్ బైక్ మీదే ప్రగతిభవన్‌కు వెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్లకు ఓటింగ్ జరుగుతోంది. అందులో ఎంఐఎం 51 చోట్ల పోటీ చేస్తోంది.

    ఇక హైదరాబాద్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే.. 9 గంటల వరకు కూడా పెద్దగా ఓటింగ్ నమోదు కాలేదు. మొదటి రెండు గంటలో 3.10 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే, కొన్ని చోట్ల ఓటర్లకు స్లిప్పులు ఇవ్వకపోవడంతో వారు పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న డిజిటల్ స్లిప్పులను ఓటర్లు చూపిస్తున్నా.. అసలు మొబైల్ ఫోన్లకు అనుమతి లేదంటూ పోలింగ్ సిబ్బంది వారిని వెనక్కు పంపేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఓటర్లు వెనుదిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పలు పోలింగ్ బూత్ ల దగ్గర ఘర్షణలు జరుగుతున్నాయి. హఫీజ్ పేట్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించారు. ఆర్కేపురం పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటుచేసుకుంది. ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Asaduddin Owaisi, Hyderabad - GHMC Elections 2020, MIM

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు