బేగంపేట - ప్యారడైజ్ ఫుల్ ట్రాఫిక్ జామ్... జనం ఇబ్బందులు

సిగ్నల్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే అరెస్ట్ చేయడానికి సిగ్నల్ వద్ద పోలీసుల నిఘా పెంచారు.

news18-telugu
Updated: October 21, 2019, 11:45 AM IST
బేగంపేట - ప్యారడైజ్ ఫుల్ ట్రాఫిక్ జామ్... జనం ఇబ్బందులు
బేగంపేట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
  • Share this:
కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడితో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో వాహనాలన్ని రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్లు, బస్సులు, బైకులు, ట్రక్కులు అన్ని రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పోలీసులు కూడా ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రగతి భవన్ కు వెళ్లే అన్ని చౌరస్తాలో పోలీసుల చెకింగ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్


సిగ్నల్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే అరెస్ట్ చేయడానికి సిగ్నల్ వద్ద పోలీసుల నిఘా పెంచారు. మరోవైపు విడతలవారిగా కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ప్రతీ అయిదు నిమిషాలకు ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు..ప్రగతి భవన్ వద్దకు చేరుకుంుటన్నారు. దీంతో ప్రగతి భవన్ ఇరు వైపులా ట్రాఫిక్ ఆగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసుల కళ్ళు గప్పి ముట్టడి ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇవికూడా చదవండి:హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

Video: ఓటు వేసిన హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

 
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు