Home /News /politics /

HYDERABAD CIVIC POLLS FORMER MP VIJAYASHANTHI SLAMS CM KCR SU

Vijayashanti: కరోనా కంటే కేసీఆర్ కుటుంబం ప్రమాదకరమైనది.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)

సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)

GHMC Elections: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(K Chandrashekar Rao)పై మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanti) మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలని ఆయన చేసిన వ్యాఖ్యాలు వింటుంటే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కినిపించని కరోనా సూక్ష్మజీవిని ప్రపంచంలోని దేశాలు అన్ని కలిసి పోరాటడం సమంజసమేనా అని అడిగినట్టు ఉందన్నారు. తెలంగాణకు కరోనా కంటే కేసీఆర్ కుటుంబం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. దుష్టశక్తిని అంతమొందించడానికి మంచి శక్తులన్ని కలిసి పోరాటం చేస్తే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుస పోస్ట్‌లు చేశారు.

    " కేసీఆర్ గారి మాటలు వింటుంటే... ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కూడా, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన నన్ను నివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో... తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టడం కూడా అదే విధంగా ఉంది. ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీ కలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ గారు అరిచి గీపెడుతున్నారు. సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్దేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే... దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్న జాతీయ పార్టీలు విజయాలు సాధించాయి. మరి అక్కడ అభివృద్ధి జరగడం వల్లే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారు. కేసీఆర్ గారి కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి తిరిగి అధికారం ఎలా దక్కుతుంది?"అని విజయశాంతి పేర్కొన్నారు.

    ఇక, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే విజయశాంతి మాత్రం ఆ వార్తలపై స్పష్టత ఇవ్వడం లేదు. అయితే టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: CM KCR, Hyderabad - GHMC Elections 2020, Vijayashanti

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు