• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • HYDERABAD CIVIC POLLS ASADUDDIN OWAISI SAYS YOUR ENTIRE GENERATION WILL END BUT HYDERABAD NAME WILL NOT CHANGE SU

GHMC Elections: వారి పేర్లనే మారుస్తాం.. కానీ హైదరాబాద్ పేరు మారదు.. యోగి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ

GHMC Elections: వారి పేర్లనే మారుస్తాం.. కానీ హైదరాబాద్ పేరు మారదు.. యోగి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ

అసదుద్దీన్ ఒవైసీ (File)

Hyderabad Civic Polls: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Share this:
    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్.. యోగి పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ పేరు మర్చాలని చూసేవారి జనరేషన్ ముగుస్తుందేమో కానీ.. హైదరాబాద్ నగరం పేరు మారదని అన్నారు. హైదరాబాద్ పేరు మర్చాలనుకునే వారి పేర్లను తామే మారుస్తామని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్‌కు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ శనివారం నగరంలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్.. కూకట్ పల్లి, జీడిమెట్ల, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం పాతబస్తీలోని లాల్‌దర్వాజ ఆలయం సమీపంలో జరిగిన 'భాగ్యనగర్ శంఖారావం' బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ రూపంలో మరో నిజాం వస్తున్నారని ఆదిత్యనాథ్ విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు ఈసారి ఎన్నికల్లో దోచుకునేవారికి అవకాశం ఇవ్వరని వ్యాఖ్యానించారు.

    "హైదరాబాద్ పేరు భాగ్యనగర్‌గా మార్చావచ్చా అని కొందరు అడిగారు. నేను వారికి ఒకటే చెప్పాను. ఎందుకు మర్చారదు.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైజాబాద్‌ పేరును అయోధ్యగా, అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చామని నేనువారికి గుర్తుచేశాను. అలాంటప్పుడు హైదరాబాద్ పేరును ఎందుకు మర్చలేం?"అని యోగి తెలిపారు.
    GHMC Elections: ప్రచారానికి ట్రంప్ ఒక్కడే మిగిలిపోయారు.. బీజేపీపై అసదుద్దీన్ వ్యంగ్యాస్త్రాలు

    GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విదేశీ అగ్రనేతల ప్రస్తావన..

    ఇక, మరోవైపు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రావడంపై అసదుద్దీన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఇవి జీహెచ్‌ఎంసీ ఎన్నికల మాదిరిగా లేవు. ప్రధాని నరేంద్ర మోదీలాగా ఒక్క దేశ ప్రధాని కోసం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఓ బాలుడు ట్రంప్‌ను కూడా పిలవాల్సింది అని అన్నాడు. అతడు చెప్పింది నిజమే. కేవలం ట్రంప్ మాత్రమే మిగిలి ఉన్నాడు" అని అన్నారు. ఇక, జీహెచ్‌ఎసంపీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. డిసెంబర్ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు