Huzurnagar Results | హుజూర్‌నగర్ గెలుపుపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్...

ఎల్లుండి తాను హుజూర్‌నగర్ ‌లో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. భారీ మెజారిటీతో సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజల ఆశలు, కోర్కె నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

news18-telugu
Updated: October 24, 2019, 4:23 PM IST
Huzurnagar Results | హుజూర్‌నగర్ గెలుపుపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్...
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయం ప్రభుత్వానికి మంచి టానిక్‌లా పనిచేస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఘనవిజయం అందించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వర్షం వల్ల సభకు వెళ్లలేకపోయినా విజయాన్ని కట్టబెట్టారని, వారిని అభినందించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం మీద నిందలు, అపవాదులు వేశారని, ప్రతిపక్షాలు ఈ దందా మానుకోవాలని హితవు పలికారు. ఎల్లుండి తాను హుజూర్‌నగర్ ‌లో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. భారీ మెజారిటీతో సైదిరెడ్డిని గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజల ఆశలు, కోర్కె నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. అరుపులు, పెడబొబ్బలు పెట్టిన బీజేపీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయని కేసీఆర్ విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు ఓట్ల కోసం వారిని తప్పుదోవ పట్టించవద్దన్నారు.

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని, ఇప్పుడు 43,233 ఓట్ల తేడాతో మళ్లీ పుంజుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను కేసీఆర్ అభినందించారు. అయితే, ఈ విజయ గర్వాన్ని తలకు ఎక్కించుకోవద్దని కేసీఆర్ .. కార్యకర్తలకు సూచించారు.

మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన రావొచ్చని చెప్పారు. నవంబర్ లోపే మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 2,00,239 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో సైదిరెడ్డికి 1,12,796 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69,563 ఓట్లు వచ్చాయి. దీంతో సైదిరెడ్డి 43,233 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>