Home /News /politics /

HuzurNagar Bypoll Results Live | హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి సంచలనం.. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం...

HuzurNagar Bypoll Results Live | హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి సంచలనం.. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం...

శానంపూడి  సైదిరెడ్డి

శానంపూడి సైదిరెడ్డి

Huzurnagar Results Live Updates | హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి దూసుకుపోతున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి 17,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కారు జోరు చూపించింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు ముగిసిన ఏడు రౌండ్లలోనూ ఆయన ఆధిక్యాన్ని కనబరిచారు.

    సైదిరెడ్డికి తొలిరౌండ్‌లో 2580 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

    రెండో రౌండ్ ముగిసేసరికి సైదిరెడ్డి ఆధిక్యం 4వేలకు పెరిగింది.

    మూడో రౌండ్ ముగిసేసరికి సైదిరెడ్డి ఆధిక్యం 6వేలకు పైగా పెరిగింది.

    నాలుగో రౌండ్ ముగిసేసరికి 9356 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లిపోయారు సైదిరెడ్డి.

    ఐదో రౌండ్ ముగిసేసరికి 11వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలోకి సైదిరెడ్డి దూసుకుపోయారు.

    ఏడో రౌండ్ ముగిసేసరికి సైది రెడ్డి 14 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 17,400 ఓట్ల ఆధిక్యంతో సైదిరెడ్డి దూసుకుపోతున్నారు.

    టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం వైపు దూసుకుపోతుండడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. ఇటు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడ్డారు.

    హుజూర్‌నగర్‌లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోటా రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీ చేశారు. ఈనెల 21న ఉప ఎన్నిక జరిగింది.

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ 14 రౌండ్లలో పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌లో 22 రేబుల్స్ మీద కౌంటింగ్ చేస్తారు.

    హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఫుల్ డిటెయిల్స్..
    1, 2, 3 రౌండ్లు నేరేడుచర్ల మండలానికి సంబంధించినవి.

    4, 5 రౌండ్లు పాలకవీడు మండలానికి సంబంధించినవి.

    6, 7, 8 రౌండ్ లు మఠంపల్లి మండలం కి సంబంధించినవి.
    9, 10, 11 రౌండ్లు మేళ్లచెరువు మండలం కి సంబంధించినవి

    12, 13 రౌండ్లు చింతలపాలెం మండలం కి సంబంధించినవి

    14, 15, 16, 17, 18 రౌండ్లు హుజూర్నగర్ మండలం, టౌన్ కు సంబంధించినవి.
    19, 20, 21,22 రౌండ్లు గరిడేపల్లి మండలం సంబంధించినవి
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, Telangana, Trs

    తదుపరి వార్తలు