Huzurnagar Bypoll | హుజూర్ నగర్‌లో ముగిసిన ప్రచారం.. తెలుసుకోవాల్సిన 5 అంశాలు..

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.20లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 21న పోలింగ్ జరగనుంది. 24న ఫలితాలు వెలువడనున్నాయి.

news18-telugu
Updated: October 19, 2019, 5:18 PM IST
Huzurnagar Bypoll | హుజూర్ నగర్‌లో ముగిసిన ప్రచారం.. తెలుసుకోవాల్సిన 5 అంశాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికకు ప్రచారం గడువు ముగిసింది. దీంతో మైక్‌లు మూగబోయాయి. దీంతోపాటు నియోజకవర్గంలో 48 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. హుజూర్‌నగర్‌లో చివరి రోజు వివిధ పార్టీల నేతలు ప్రచారం చేపట్టారు. హుజూర్ నగర్‌లో మొత్తం 28 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, బీజేపీ తరఫున రామారావు పోటీ చేస్తున్నారు. వీరిలో ప్రధానంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సైదిరెడ్డి మధ్యనే పోటీ ఉండనుంది. తొలుత టీఆర్ఎస్‌కు మద్దతు పలికిన సీపీఐ.. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ తమ మద్దతు ఉపసంహరించుకుంది. ఈనెల 21న సోమవారం ఉప ఎన్నిక జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 24న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హూజర్‌నగర్‌తో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ, హర్యానాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోని పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. ఆయా ఎన్నికల ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పడింది.

2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహిస్తోంది.

కొన్ని రోజుల ముందు సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో భాస్కరన్‌ను ఎస్పీగా నియమించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని, సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలంటూ తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేశారు. మరోవైపు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల పరిశీలకుడిగా 1983 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి బీఆర్ బాలకృష్ణన్‌ వ్యవహరిస్తున్నారు.

జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం



First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...