news18-telugu
Updated: October 17, 2019, 9:01 AM IST
సీఎం కేసీఆర్
హుజూర్నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.మంత్రి జగదీశ్వర్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు దాదాపు 50వేల మంది జనం హాజరుకానున్నట్టు సమాచారం. అయితే గులాబీ బాస్ కేసీఆర్ ఈ సభకు హాజరువుతారా? లేదా? అన్న సస్పెన్స్ నెలకొంది. అభ్యర్థి ఎన్నికల ఖర్చు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టడం.. ఆర్టీసీ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలే అవకాశం ఉండటంతో కేసీఆర్ హుజూర్ నగర్లో అడుగుపెడుతారా లేదా? అన్న చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షాడో టీమ్స్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫోకస్ పెట్టాయి. సీఎం రాకపోకలు.. బహిరంగ
సభకు అయ్యే ఖర్చులు.. వీటన్నింటి అభ్యర్థి ఖాతాలోనే ఎన్నికల సంఘం లెక్క కడుతుంది. కొన్ని లెక్కలు పార్టీ ఖాతాలోకి,స్టార్ క్యాంపెయినర్‌గా కేసీఆర్ ఖాతాలోకి వెళ్తాయి. అయినప్పటికీ ఎన్నికల ఖర్చు నిబంధన పట్ల టీఆర్ఎస్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ పలు రోడ్ షోలు కూడా రద్దు చేసుకున్నారు. ఇకపోతే సభకు ఆర్టీసీ కార్మికులు కూడా హాజరై.. నిరసన తెలిపితే.. పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ప్రచారానికి వస్తారా రారా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Published by:
Srinivas Mittapalli
First published:
October 17, 2019, 9:01 AM IST