బీజేపీకి బిగ్ షాక్... టీఆర్ఎస్‌ ఫుల్ హ్యాపీ

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)

తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు బీజేపీకి బిగ్ షాక్ ఇవ్వగా... టీఆర్ఎస్ వర్గాలు సంబరాల్లో మునిగేలా చేస్తున్నాయి.

  • Share this:
    దక్షిణాదిలో తమ తదుపరి టార్గెట్ తెలంగాణే అని భావిస్తున్న బీజేపీ... కొద్ది రోజుల నుంచి అందుకు తగ్గట్టుగా ఇక్కడ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ బలహీనపడుతున్న క్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన బీజేపీ... ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకోవడంలో చాలా వరకు సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. లోక్ సభ ఫలితాల్లో బీజేపీ సాధించిన సీట్ల కారణంగా తెలంగాణలోని నేతలు కూడా ఆ పార్టీ వైపు కొంతమేరకు ఆకర్షితులయ్యారు. ఒక దశలో తెలంగాణలో బీజేపీ బలపడుతుందేమో అనే టెన్షన్ కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలైంది.

    అయితే తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు బీజేపీకి బిగ్ షాక్ ఇవ్వగా... టీఆర్ఎస్ వర్గాలు సంబరాల్లో మునిగేలా చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ... స్థానిక సంస్థ ఎన్నికల్లో బోల్తా పడింది. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఓట్లను బట్టి ఆ పార్టీకి తెలంగాణలో ఉన్న అసలు సిసలు బలం ఏమిటన్నది తేలిపోతుందని చాలామంది భావించారు. హుజూర్ నగర్‌లో గెలవకపోయినా... గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు సాధిస్తే బీజేపీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందని ఆ పార్టీ భావించింది.

    కానీ వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఉప ఎన్నికల్లో బీజేపీకి 3 వేల లోపు ఓట్లు రావడం...డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. బీజేపీకి ఇంత తక్కువ స్థాయిలో ఓట్లు రావడంతో... ఇకపై తాము ఎప్పటిలాగే బీజేపీని టార్గెట్ చేయొచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కేవలం గాలివాటం మాత్రమే అని పదే పదే వాదించిన టీఆర్ఎస్... ఇక ఈ వాదనకు మరింత పదునుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    First published: