LIVE NOW

Assembly Elections Results 2019 : మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిదే అధికారం, హర్యానాలో హంగ్..

Huzurnagar​ byelection Result: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇటు తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది.

Telugu.news18.com | October 24, 2019, 7:41 PM IST
facebook Twitter Linkedin
Last Updated October 24, 2019
auto-refresh
Assembly Elections Results 2019:  మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాట తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. రెండు రౌండ్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి  లీడ్‌లో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి ఆయన 9356 ఓట్ల ఆధిక్యంలో ఆయన ముందుకు పోతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కౌంటింగ్ ప్రారంభ ట్రెండ్స్‌ను చూస్తే.... బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు హర్యానాలో కూడా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా లీడ్‌లో ఉన్నారు.  ఇటు శివసేన వారసుడు ఆదిత్య థాక్‌రే పోటీ చేసిన వర్లిలో కూడా ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక తెలంగాణలో అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు పెద్ద సవాల్‌గా మారిన హుజూర్ నగర్‌ ఉపఎన్నిక ఫలితంపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 84.75శాతం పోలింగ్ నమోదు కాగా.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వచ్చాయి. కారుకు 50శాతానికి పైగా ఓట్లు.. కాంగ్రెస్ పార్టీకి 40శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి. Read More
Load More