హోమ్ /వార్తలు /politics /

Huzurnagar polling: హుజూర్‌ నగర్‌లో భారీగా పోలింగ్..

Huzurnagar polling: హుజూర్‌ నగర్‌లో భారీగా పోలింగ్..

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ లోపు క్యూలైన్లలో ఉన్న వారిందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు అధికారులు. ఓటర్లను ప్రలోభ పెట్టుకుండా అన్ని చోట్లా ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు అన్ని చోట్లా నిఘా పెట్టారు.

    హుజూర్‌నగర్‌లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపు 70శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ పూర్తయ్యే సరికి 80 శాతం వరకు పోలింగ్ నమోదు కావచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్ల క్యూలైన్‌లు కొనసాగుతున్నాయి. తమ ఓటు వేసేందుకు హుజూర్ నగర్ ఓటర్లు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ లోపు క్యూలైన్లలో ఉన్న వారిందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు అధికారులు. ఓటర్లను ప్రలోభ పెట్టుకుండా అన్ని చోట్లా ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు అన్ని చోట్లా నిఘా పెట్టారు.

    హుజూర్‌నగర్ స్థానంలో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోరుసాగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పోలింగ్ జరుగుతున్న తీరును బట్టీ... ప్రజలు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తున్నదీ ఇప్పుడే చెప్పేలమంటున్నారు. మరోవైపు మహారాష్ట్ర, హర్యానాలో జోరుగా పోలింగ్ సాగుతోంది. మహారాష్ట్రలో అక్కడక్కడా వాన కురుస్తున్నా... పోలింగ్‌కి ఎలాంటి ఆటంకమూ కలగట్లేదని అధికారులు తెలిపారు.

    First published:

    ఉత్తమ కథలు