Huzurabad Bypoll: రంగంలోకి సీఎం కేసీఆర్.. హుజురాబాద్‌లో రోడ్‌షోలు.. ఎప్పుడంటే..

'సీఎం కేసిఆర్

Huzurabad By Election: ఎన్నికల నిబంధనలను అనుసరించి హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. అక్టోబరు 26, 27న హుజురాబాద్‌లో రోడ్ షోలు నిర్వహిస్తే బాగుంటుందని నేతలు సీఎం కేసీఆర్‌ను కోరారు.

  • Share this:
    హుజురాబాద్‌లో ఎన్నికల (Huzurabad Bypoll) రాజకీయాలు మరింతగా హీటెక్కాయి. ప్రధాని పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా బడా నేతలంతా రంగంలోకి దిగారు. ఊరూరు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నీ తానై నడిపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. మరి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) హుజురాబాద్ ప్రచారానికి ఎప్పుడొస్తారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకపరిధిలో ఈసీ ఆంక్షలు విధించడంతో బహిరంగ సభలపై నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ భావించింది. కానీ ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది.

    Huzurabad : కేసీఆర్ ఓడితే ఇతనే కారకుడవుతాడా? -ప్రచారం లేకున్నా ఓట్లు

    అక్టోబరు 30న హుజూరాబాద్‌లో పోలింగ్ జరగనుండగా..అక్టోబరు 26 లేదా 27న బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ హైకమాండ్ మొదట నిర్ణయించింది. కానీ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లోనూ సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభపై సీఎం కేసీఆర్ పునరాలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తన నివాసంలో మంత్రులు, ఇతర నేతలతో ఆయన సమావేశమయ్యారు. హుజరాబాద్‌లో ప్రచారం చేస్తున్న హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు సీఎం కేసీఆర్.

    Huzurabad ఉప ఎన్నిక ఫలితం ఇదే! -డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా?

    ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో బహిరంగ సభకు బదులుగా రోడ్ షోలు నిర్వహించాలనే అంశం వీరి మధ్య చర్చకు వచ్చింది. ఎన్నికల నిబంధనలను అనుసరించి హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. అక్టోబరు 26, 27న హుజురాబాద్‌లో రోడ్ షోలు నిర్వహిస్తే బాగుంటుందని నేతలు సీఎం కేసీఆర్‌ను కోరారు. నేతల విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రోడ్‌షోలకు సంబంధించిన షెడ్యూల్, రోడ్ మ్యాప్‌ను రూపొందించి తనకు పంపాలని కేసీఆర్‌ స్థానిక మంత్రులు, నేతలకు సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నేతలతో సమావేశమై షెడ్యూలుకు రూపకల్పన చేసి, సీఎం కేసీఆర్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రోడ్‌షోలకు సంబంధించి నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.

    తొలిసారి వైఫల్యాన్ని ఒప్పుకున్న KCR -బరువెక్కిన గుండెతో సంచలన ఆదేశాలు

    కాగా, హుజురాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలయింది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అక్టోబరు 8న నామినేషన్ల దాఖలు ముగిసింది. అక్టోబరు 11న నామినేషన్లను పరిశీలించారు. అక్టోబరు 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 37 మంది హుజురాబాద్‌లో పోటీచేస్తున్నారు. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: