Home /News /politics /

HUZURABAD BYPOLL REVANTH REDDY AND EETALA RAJENDER SECRET MEETING IN HYDERABAD HOTEL MINISTER KTR SENSATIONAL COMMENTS SK

Huzurabad Bypoll: ఈటల, రేవంత్ రెడ్డి రహస్య భేటీ.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు

ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Huzurabad Bypoll: కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్, బీజేపీలు ఓటు బదిలీ చేసుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈటల, రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందంలో భాగంగానే హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆయన ఆరోపించారు.

ఇంకా చదవండి ...
  హుజురాబాద్ రాజకీయాలు (Huzurabad Politics) మరింతగా వేడెక్కుతున్నాయి.  ప్రధాన పార్టీలన్నీ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ , టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాదు ఇరువర్గాల ఘర్షణలకు కూడా దిగుతున్నాయి. ఈ క్రమంలో హుజురాబాద్ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) రహస్యంగా భేటీ అయ్యారని బాంబు పేల్చారు. గోల్కొండ కోటలో వీరిద్దరు రహస్య మంతనాలు జరిపారని, దీనికి సంబంధించి తమ వద్ద ఆధారలు కూడా ఉన్నాయని తెలిపారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.

  ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాదు. కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి.  హుజురాబాద్‌లో రెండు జాతీయ పార్టీల అభ్యర్థిని టీఆర్ఎస్ పోటీపడుతోంది. ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఈటల గెలుపు వారికి ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యం.  ఏడాది తర్వాత ఈటల రాజందర్ కాంగ్రెస్‌లో చేరే ఒప్పందం జరిగింది.  గోల్కొండ రిసార్ట్‌లో ఈటల, రేవంత్ రెడ్డి కలిశారు. మా దగ్గర ఫొటోలు, ఇతర ఆధారాలు కూడా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

  Minister Harish: అబద్ధాల పునాదుల మీద మభ్య పెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నరు: మంత్రి హరీష్

  కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్, బీజేపీలు ఓటు బదిలీ చేసుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈటల, రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందంలో భాగంగానే  హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆయన ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఒక అనామకుడిని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు.  అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా చేయడం లేదని చెప్పారు కేటీఆర్.  అంతకాదు ఈటలకు అనుకూలంగా రేవంత్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎంత మంది ఒక్కటైనా..గెల్లు శ్రీనివాస్ గెలును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు కేటీఆర్. హుజురాబాద్ గడ్డపై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

  Huzurabad: హుజురాబాద్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాక పుట్టించే  కామెంట్స్

  మరోవైపు ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపైనా స్పందించారు మంత్రి కేటీఆర్. ఈటలకు టీఆర్‌ఎస్‌ అనేక పదవులు ఇచ్చి గౌరవించిందని, కానీ ఆయన మాత్రం టీఆర్ఎస్ విచ్ఛిన్నానికి ప్రయత్నించారని విమర్శిచారు. ఆయన ఎలాంటి తప్పుచేయక పోతే ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకోవాల్సిందని అన్నారు. ఈటల  రాజేందర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టంచేశారు కేటీఆర్.

  Huzurabad: ఈటలకు మంచి పేరు ఉండేది.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బాగుండు: వీహెచ్

  కాగా, హుజురాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలయింది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అక్టోబరు 8న నామినేషన్ల దాఖలు ముగిసింది. అక్టోబరు 11న నామినేషన్లను పరిశీలించారు. అక్టోబరు 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 37 మంది హుజురాబాద్‌లో పోటీచేస్తున్నారు. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Eetala rajender, Huzurabad, Huzurabad By-election 2021, KTR, Revanth reddy, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు