Home /News /politics /

HUZURABAD BYPOLL EVM AND VVPAT FOUND IN PRIVATE VEHICLE BJP CONGRESS WORKERS PROTEST AGAINST TRS SK

Huzurbad Bypoll: ప్రైవేట్ వాహనంలో ఈవీఎంల తరంలింపు? హుజురాబాద్‌లో మరో రచ్చ

వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు

వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు

Huzurabad Bypoll: పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరూ ఊహించనంత భారీగా పోలింగ్ నమోదయింది. ఏకంగా 86.33శాతం ఓటింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

    ఇప్పుడు తెలంగాణ (Telangana) అంతటా హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll) గురించే చర్చ జరుగుతోంది. భారీగా పోలింగ్ భారీగా నమోదవడంతో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈటల రాజేందర్ (Eetala Rajender) ఆత్మగౌరవ నినాదం గెలుస్తుందా? టీఆర్ఎస్ (TRS) అభివృద్ధి మంత్రం నిలబడుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి మరో రచ్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను ప్రైవేట్ వాహనంలో తరలించడంపై దుమారం రేగుతోంది. ఈవీఎంను ఓ వ్యక్తి కారులో తరలిస్తుండగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆందోళనకు దిగారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    Eetala rajender : ఫలితాల తర్వాత తెలంగాణలో పెను మార్పులు..ఈటల





    Huzurabad : ఎవ‌రి ధీమా వారిది.. గెలుపు మాదంటే మాదంటున్న పార్టీలు

    ఈ విషయం కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఈవీఎంలు భద్రపరుసున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్దకు వెళ్లారు. ఈవీఎంను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈవీఎంను ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రైవేట్‌ వాహనంలో ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


    కాగా, పలు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా హుజురాబాద్‌లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎవరూ ఊహించనంత భారీగా పోలింగ్ నమోదయింది. ఏకంగా 86.33శాతం ఓటింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌‌లో 84 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదయింది. పెరిగిన ఓటింగ్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది తెలియాల్సి ఉంది.

    నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే

    ఐతే గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. రేస్‌లో కాంగ్రెస్ వెనకబడిందన్న వార్తల నేపథ్యంలో... బీజేపీ, టీఆర్ఎస్‌లో విజయం ఎవరిదన్న దానిపై ఎవరికి వారు తమ అంచనాలు వేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత, ఈటల రాజేందర్‌ మంచితనం, కేంద్ర పథకాలే.. తమను గెలిపిస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ శ్రేణులు ఢంకా బజాయిస్తున్నారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ రసవత్తర పోరులో విజేతలెవరన్నది నవంబరు 2న తేలనుంది. మంగళవారం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Eetala rajender, Huzurabad, Huzurabad By-election 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు