హోమ్ /వార్తలు /National రాజకీయం /

Huzurabad Bypoll: హుజురాబాద్‌లో ప్రచార హోరు.. ఈటల కోసం రంగంలోకి అమిత్ షా..?

Huzurabad Bypoll: హుజురాబాద్‌లో ప్రచార హోరు.. ఈటల కోసం రంగంలోకి అమిత్ షా..?

Huzurabad byelection: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారాన్ని మరింత వేడెక్కించబోతున్నారు. అక్టోబరు 16 లేదా 17న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Huzurabad byelection: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారాన్ని మరింత వేడెక్కించబోతున్నారు. అక్టోబరు 16 లేదా 17న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Huzurabad byelection: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారాన్ని మరింత వేడెక్కించబోతున్నారు. అక్టోబరు 16 లేదా 17న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

  హుజురాబాద్‌(Huzurabad)లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఊరూరు తిరుగుతూ ఓట్ల కోసం అడుగుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు.. ఆరోపణలతో.. ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ (Gellu Srinivas)కు మద్దతుగా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు (Harish rao) అన్నీ తానై నడిపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eelata Rajender) కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఐతే టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఆయన విజయానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని కమలం పెద్దలు భావిస్తున్నారు.

  టీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించునున్నారు. గెల్లుకు మద్దతుగా బహిరంగ సభను నిర్వహించి.. ప్రసంగించనున్నారు. ఐతే కేసీఆర్ సభకు ధీటుగా బీజేపీ కూడా ప్రచార సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఆ సభలో అమిత్ షా పాల్గొంటారని తెలుస్తోంది. అమిత్ షా ప్రచారంతో కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టాలని బీజేపీ యోచిస్తోంది. హుజురాబాద్‌లో వేయి మందికి మించి బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం  ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ మొదట అమిత్‌షా సభను రద్దు చేసుకుంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో  సభ నిర్వహించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  Harish Rao: అది నిరూపిస్తారా ? ఈటలకు మంత్రి హరీశ్ రావు సవాల్

  హుజూరాబాద్‌ నియోజకవర్గానికి పొరుగు జిల్లాలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అలాంటి సభకే ప్లాన్ చేస్తోంది. హుజూరాబాద్‌ పక్క జిల్లాలో  అమిత్‌షా సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఎవ‌రిది గెలుపు.. ఎవ‌రిది ఓట‌మి?.. హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజ‌కీయం

  ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారాన్ని మరింత వేడెక్కించబోతున్నారు. అక్టోబరు 16 లేదా 17న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో విస్తృతంగా పర్యటించేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.  వచ్చే వారం, పది రోజు ల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించేలా కార్యాచారణ రూపొందిస్తున్నారు. మూడు లేదా నాలుగు పోలింగ్‌ బూత్‌లు కలిపి ఒక శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసి..  ఆ స్థాయిలో ప్రజలను కలుసుకునేందుకు ఎన్నికల కమిటీలను ఇప్పటికే బీజేపీ ఏర్పాటు చేసింది.  హుజురాబాద్‌లో అన్ని పోలింగ్‌ బూత్‌లో ప్రచారం చేసేలా  శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసేలా  వివిధ మోర్చాలు, అనుబంధ విభాగాల వారికి విధులను కేటాయించారు.

  Huzurabad by-Elections : ప్లీజ్ మా ఇంటికి ప్ర‌చారానికి రావొద్దు.. మా ఓటు  వారికే

  కాగా, హుజురాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా  14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలయింది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది.  అక్టోబరు 8న నామినేషన్ల దాఖలు ముగిసింది. అక్టోబరు 11న నామినేషన్లను పరిశీలించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టి వరకు ఉంది. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, Bjp, Eetala rajender, Huzurabad, Huzurabad By-election 2021, Telangana

  ఉత్తమ కథలు