HUZURABAD BYPOLL 2021 EETALA RAJENDER PLAYS TRS DRUMS HARISH RAO PLAYS BJP DRUMS PHOTOS VIRAL HERE IS TRUTH SK
Huzurabad: టీఆర్ఎస్ డప్పుకొట్టిన ఈటల.. బీజేపీ డప్పుకొట్టిన హరీష్.. అసలు ఫొటోలు ఇవే..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు ఇవే
Huzurabad Bypoll: ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ డప్పు కొడుతున్న ఫొటో.. హరీష్ రావు బీజేపీ డప్పు కొడుతున్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిలో నిజమెంత? అసలు ఫొటోలేంటి?
హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం (Huzurabad Election campaign) తారా స్థాయికి చేరింది. బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) నేతలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా తలపడుతన్నారు. ఒకరిపై మరొకొరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ సెగలు రేపుతున్నారు. ఐతే జనం మధ్యలో చేసే ప్రచారం ఒక ఎత్తయితే.. సోషల్ మీడియాలో చేసే ప్రచారం మరో ఎత్తు. సోషల్ మీడియాలను ఈ రెండు పార్టీలు బాగానే వాడేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ..ఇలా పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ట్విటర్ (Twitter), ఫేస్బుక్ (Facebook) వేదికగా పోస్ట్‌ల మోత మోగిస్తున్నారు. ఐతే ఇందులో కొన్ని వాస్తవాలు ఉంటే.. మరికొన్ని మాత్రం తప్పుడు ప్రచారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫొటోలను మార్ఫింగ్ చేసి.. పక్క పార్టీలపై దుష్ప్రచారం చేసి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు ఫొటోలు వైరల్‌గా మారాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender) టీఆర్ఎస్ డప్పు కొడుతున్న ఫొటో.. మంత్రి హరీష్ రావు (Harish Rao) బీజేపీ డప్పు కొడుతున్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీకి మద్దతుగా హరీష్ రావు ప్రచారం చేస్తున్నారని కమలం కేడర్ తమ గ్రూప్‌ల్లో ఫొటోను వైరల్ చేస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ సైన్యం కూడా ఈటల రాజేందర్ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తోంది. వాస్తవానికి ఈ రెండు ఫొటోలూ ఫేక్. ఈటల రాజేందర్, హరీష్ రావు ప్రచారం ఫొటోలను మార్ఫింగ్ చేసి.. ఇలా క్రియేట్ చేశారు.
హరీష్ రావు ఫొటోపై టీఆర్ఎస్ నేత క్రిషన్ క్లారిటీ ఇచ్చారు. ఖాళీ డప్పులపై కమలం గుర్తును సృష్టించి హరీష్ రావుపై బీజేపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దయచేసి ఖాళీ డప్పులను వాడొద్దని ఆయన మంత్రి హరీష్ రావుకు సూచించారు.
దయచేసి ఖాళీ డప్పులు వాడకండి @trsharish గారు,
బిజెపి సదువు లేని సోషల్ మీడియా ఆ డప్పుల మీద బిజెపి పార్టీ పేరు, గుర్తు ఎడిటింగ్ చేసుకొని సిగ్గు లేకండా చిల్లర ప్రచారం చేసుకొని , దానికే ఏదో సాధించింరని అనుకుంటరు సిల్లీ ఫెలోస్ ... pic.twitter.com/Vs7uQYGxNF
అటు టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు సర్క్యులేట్ చేస్తున్న ఈటల రాజేందర్ ఫొటో కూడా వాస్తవమైనది కాదని న్యూస్ 18 ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఈటల రాజేందర్ సెప్టెంబరు 25న వీణవంక మండలం మల్లన్నపల్లి గ్రామంలో పర్యటించారు. ఆయనకు డప్పుదరువులు, మంగళహారతుల మధ్య బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అప్పుడు ఓ డప్పు తీసుకొని స్వయంగా వాయించారు ఈటల రాజేందర్. దానిపై 'ఈటల రాజేందర్ నాయకత్వం వర్థిల్లాలి' అని రాసి ఉంది. కానీ కొందరు దానిని తొలగించి.. 'కారు గుర్తు మన ఓటు' అని రాశారు.
గ్రామానికి విచ్చేసిన సందర్భంగా డప్పు చప్పుళ్లతో, కోలాట నృత్యాలతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. (2/2)@BJP4Telanganapic.twitter.com/hy1jwwM6TR
సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఇలాంటి పోస్ట్‌లు వస్తుంటాయి. అందులో కనిపించే ప్రతి వార్తను, పోస్ట్‌ను నమ్మవద్దు. అందులో నిజమెంతో? అబద్ధమెంతో? తెలుసుకోకుండా గుడ్డిగా ఫార్వార్డ్ చేయవద్దు. టీవీ/వార్తా పత్రికలు వంటి ప్రధాన మాధ్యమాల్లో వచ్చిన తర్వాతే నిర్ధారించుకోవాలి. లేదంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన వార్తలు వస్తాయి. వాటిని చదివితే మరింత క్లారిటీ వస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.