Home /News /politics /

Huzurabad by Poll: హుజురాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. ఆ మహిళ నేతకు మెజారిటీ నాయకుల మద్దతు..!

Huzurabad by Poll: హుజురాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. ఆ మహిళ నేతకు మెజారిటీ నాయకుల మద్దతు..!

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు హోరాహోరి ప్రచారం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై స్పష్టత కరువైంది.

    హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు హోరాహోరి ప్రచారం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు.. ఏమైనా సమీకరణాలు మారితే రాజేందర్ స్థానంలో.. ఆయన సతీమణి జమునారెడ్డి బరిలో ఉండొచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక, టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో దిగనున్నారు. ప్రస్తుతం హుజురాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం.. హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి అంత దూకుడు ప్రదర్శించడం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Huzurabad Congress candidate) ఎవరనే దానిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలోనే కొండా సురేఖతో(Konda Surekha) పాటు మరికొందరు నేతలు హుజురాబాద్(Huzurabad) టికెట్ రేస్‌లో ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

    అయితే కాంగ్రెస్(Congress Party) మాత్రం హుజురాబాద్‌కు సంబంధించి ఆచి తూచి వ్యహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేనందునే కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై అంత వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటే ఈ విషయాన్ని త్వరగా తేల్చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీలో అందరి ఆమోదంతోనే హుజురాబాద్ అభ్యర్థి ప్రకటన చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

    Hyderabad: మహిళపై ఎదురింటి వ్యక్తి పెంపుడు కుక్కలు దాడి.. పోలీసులు ఏం చేశారంటే..

    అయితే సోమవారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో టీపీసీసీ(TPCC) వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌(Manickam Tagore) భేటీ అయిన సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నిక అంశంపై చర్చించారు. అయితే ఉప ఎన్నిక అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు పేర్లతో జాబితాను సిద్దం చేసింది. కొండా సురేఖ, కృష్ణారెడ్డి, సదానంద పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం.. మాణికం ఠాగూరుకు అందజేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన వారి పేర్లపై పార్టీ నాయకుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు.





    Student Bus Pass: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి బస్‌పాస్ కౌంటర్లు.. ఎప్పటి నుంచంటే..?

    అయితే సమావేశంలో పాల్గొన్న మెజారిటీ సభ్యులు హుజురాబాద్‌లో కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మద్దతు తెలపినట్టుగా సమాచారం. అయితే అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత వాటిని మాణికం ఠాగూర్.. వాటిని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి(Sonia Gandhi) పంపనున్నారు. అధిష్టానం ఆమోదం పొందిన తర్వాత అభ్యర్థి ఎవరనే దానిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అయితే నేటి సమావేశం పూర్తైన తర్వాత హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Congress, Huzurabad By-election 2021, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు