Huzurabad: అప్పుడు దుబ్బాక.. ఇప్పుడు హుజూరాబాద్.. రెండూ ఒకే సమయంలో.. సంవత్సరం మారిందంతే..

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

Huzurabad: గతేడాది ఇదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నిక జరగడం.. ఇప్పుడు కూడా ఇదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Share this:
    హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ ఎన్నికకు ఎన్నిక సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8, ఉప సంవసంహరణకు అక్టోబర్ 13గా పేర్కొంది. 30 ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ చాలాకాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ విషయంలో వెనుకబడిపోయింది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక గతేడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికను గుర్తు చేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకకు ఉప ఎన్నిక వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 29 ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఎన్నికలు జరగ్గా.. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.

    ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చింది బీజేపీ. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు విజయం సాధించారు. ఇప్పుడు కూడా కాస్త అటు ఇటుగా అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ప్రధాన ప్రత్యర్థులుగా టీఆర్ఎస్, బీజేపీలే ఉన్నాయి. దీంతో ఇక్కడ ఫలితం ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలుపు బాధ్యతలను ఆ పార్టీ ముఖ్యనేత, మంత్రి హరీశ్ రావు భుజాన వేసుకున్నారు.

    అన్నీ తానై దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఊహించని విధంగా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను గులాబీ బాస్ కేసీఆర్ హరీశ్ రావు మీదే పెట్టారు. కొన్ని నెలలుగా ఆయన హుజూరాబాద్ మీదే దృష్టి పెట్టారు. అక్కడ టీఆర్ఎస్ గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో దుబ్బాకలో సక్సెస్ కాలేకపోయిన టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు.. హుజూరాబాద్‌లో పార్టీని గెలిపించి మళ్లీ తన సత్తా చాటుతారా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

    మరోవైపు దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఓడించి.. టీఆర్ఎస్‌, హరీశ్ రావుకు షాక్ ఇచ్చిన బీజేపీ.. హుజూరాబాద్‌లోనూ అదే సీన్ రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. మొత్తానికి గతేడాది ఇదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నిక జరగడం.. ఇప్పుడు కూడా ఇదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: