Telangana: ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఈటల రాజేందర్

Huzurabad By election: హుజురాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆర్డీవో భారీగా దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Share this:
    తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈటల టార్గెట్‌గా టీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే బాల్కసుమన్ మరోసారి ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డారు. కోళ్ల ఫామ్ నడుపుకునే ఈటల రాజేందర్‌‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కేసీఆరేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెంబర్ 2 స్థానంలో ఉంచితే...ఆయన మాత్రం శత్రువులతో చేతులు కలిపి పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్రచేశారని సంచలన ఆరోపణలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని బాల్క సుమన్ విమర్శించారు. తల్లిపాలు రొమ్ము గుద్దిన వ్యక్తి ఈటల రాజేందర్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అటు రేవంత్ రెడ్డిపైనా సెటైర్లు వేశారు బాల్క సుమన్. రేవంత్ రెడ్డి తుపాకీ రాముడు.. బండి సంజయ్ తోక రాముడు అంటూ విమర్శించారు. వీరి పార్టీ అధ్యక్ష పదువులు సీఎం కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు.
    MLA Balka Suman, Balka Suman Father Balka Suresh, Balka Suman Father Passed Away, Balka Suman father died, Balka suman, ఎమ్మెల్యే బాల్క సుమన్, బాల్క సుమన్ ఇంట్లో విషాదం, బాల్క సుమన్‌ తండ్రి కన్నుమూత, బాల్క సుమన్‌కు పితృవియోగం, బాల్క సురేష్
    బాల్క సుమన్(ఫైల్ ఫొటో)

    మరోవైపు ఈటల రాజేందర్ కూడా ప్రభుత్వంపై తన దైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. హుజురాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్డీవో భారీగా దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని.. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 డొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని విరుచుకుపడ్డారు ఈటల రాజేందర్. ఎవరి ఓటును వారు కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్‌కు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమ ద్రోహులంతా కేసీఆర్ పక్కన చేరారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు.


    హుజురాబాద్‌లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గ పరిధిలో కలియ తిరుగుతున్నారు. వరుసగా కార్యకర్తలతో సమాశమవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు కాలేదు. ఈటల రాజేందర్‌ను ఓడించే బలమైన నేత కోసం సీఎం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు ముద్దసాని పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కృష్ణమోహన్, ఎల్.రమణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తారో చూడాలి. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published: