Huzurabad Bypoll: హీటెక్కిన హుజురాబాద్.. నేడు ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్ నామినేషన్

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad Byelections 2021: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తొలి రోజు నామినేషన్ వేశారు. ఆ తర్వాత ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ నామినేషన్ వేయలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలుపుకొని ఇప్పటి వరకు 24 నామినేషన్లు దాఖలయినట్లు తెలుస్తోంది.

 • Share this:
  హుజురాబాద్‌ (Huzurabad)లో ఉప ఎన్నికల (By election) రాజకీయ వేడెక్కింది. ప్రచార హోరు తారా స్థాయికి చేరింది. అన్ని పార్టీల అభ్యర్థులు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో నామినేషన్ దాఖలుకు ఇవాళే ఆఖరి రోజు. హుజురాబాద్‌లో నామినేషన్ దాఖలు ప్రక్రియ అక్టోబరు 1 నుంచి ప్రారంభమయింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ (Gellu Srinivas) తొలి రోజు నామినేషన్ వేశారు.  ఆ తర్వాత ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ నామినేషన్ వేయలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలుపుకొని ఇప్పటి వరకు 24 నామినేషన్లు దాఖలయినట్లు తెలుస్తోంది.  నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

  మధ్యాహ్నం 12 గంటలకు హుజురాబాద్ పట్టణంలో బల్మూరి వెంకట్ (Balmoori Venkat) నామినేషన్ దాఖలు చేయయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్లు, చైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  High court: 16 ఏళ్ల బాలిక అబార్షన్‌కు అనుమతి.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

  ఇక బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eetala Rajender) మధ్యాహ్నం 1 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్ (Kishan Reddy)డి పాల్గొంటున్నారు.

  Richest WOmen: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఎవరో  తెలుసా?

  మరోవైపు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవహారం హుజురాబాద్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నామినేషన్ వేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు 70 మంది క్యూలైన్‌లో నిల్చున్నారు. ఐతే రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్‌తో పాటు అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు 10 మంది ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. ఐతే అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. కుంటి సాకులు చెబుతూ..తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే నడుకుంటున్నామని.. కోవిడ్ నిబంధనలను అనుగుణంగా ఎవరైనా నామినేషన్ వేయవచ్చని చెబుతున్నారు.

  హుజురాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీస్ అధికారులు నిఘా, తనిఖీలను ముమ్మరం చేశారు. హుజురాబాద్‌కు వెళ్లే అన్ని రోడ్లపై పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.  అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్న ఆర్డీవో కార్యాలయంతో పాటు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్లతో నిఘాపెట్టారు.

  Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు ఛాలెంజ్ ఇదే

  కాగా, హుజురాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా  14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలయింది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో నామినేషన్ల దాఖలు ముగుస్తుంది. అక్టోబరు 11న నామినేషన్లను పరిశీలిస్తున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 13కు గడువు ఉంది. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి, ఫలలితాలను ప్రకటిస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published: