హుజూర్ నగర్ హీరో... ఎవరీ సైదిరెడ్డి

2018 ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను దాదాపు ఓడించినంత పని చేశారు సైదిరెడ్డి. విజయం దక్కకపోయినప్పటికీ... నియోజకవర్గంలో ప్రజలకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషి చేశారు.

news18-telugu
Updated: October 24, 2019, 1:45 PM IST
హుజూర్ నగర్ హీరో... ఎవరీ సైదిరెడ్డి
శానంపూడి సైదిరెడ్డి
  • Share this:
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విజయం సాధించిన సైదిరెడ్డి గురించి రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గతంలో గట్టి పోటీ ఇచ్చిన సైదిరెడ్డి... ఇప్పుడు ఆయన సతీమణి పద్మావతిని ఓడించి... పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నాడు. తన స్వప్నమైన ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నాడు. రాజకీయ నేపథ్యంతో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సైదిరెడ్డి... కాలేజీ రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. మాధవరెడ్డి, వేనెపల్లి చందర్ రావు సహకారంతో టీడీపీలో చేరారు. 2000 సంవత్సరంలో, అతను కరేబియన్ ప్రాంతంలోని మొత్తం ఐటి విభాగానికి అధిపతిగా యునైటెడ్ నేషన్‌లో ఉద్యోగం కొరకు జమైకాకు వెళ్లారు సైదిరెడ్డి.

తరువాత 2005 సంవత్సరంలో అతను కెనడాలోని వాంకోవర్కు వెళ్లి ప్రపంచ ప్రముఖ ఐటి కంపెనీలో ఉద్యోగం పొందారు. తన సహజమైన ఉత్సాహం వాంకోవర్ లో ఉత్తమ శాఖాహార రెస్టారెంట్లలో ఒకదాన్ని స్థాపించటానికి ప్రేరేపించింది. ఆ తరువాత కేసీఆర్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులైన సైదిరెడ్డి... జగదీష్ రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. 2017 సంవత్సరంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సైదిరెడ్డి... 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఉత్తమ్‌ను దాదాపు ఓడించినంత పని చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ప్రజలకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వచ్చిన సైదిరెడ్డి... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషి చేశారు. అలా నియోజకవర్గంలో తన నెట్‌వర్క్‌ను బాగా పెంచుకున్నారు. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేయడంతో... అప్పటి నుంచే ఈ సీటుపై ఫోకస్ పెంచారు సైదిరెడ్డి. టీఆర్ఎస్ నేతల సహకారం కూడా లభించడంతో... ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
First published: October 24, 2019, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading