హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల... 30 వరకు నామినేషన్లు

Huzurnagar bypoll 2019 | కొద్ది సేపటి క్రితం జిల్లా ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

news18-telugu
Updated: September 23, 2019, 12:01 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల... 30 వరకు నామినేషన్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. కొద్ది సేపటి క్రితం జిల్లా ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అక్టోబర్ 21న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరగనుంది. అదే నెల 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూర్ నగర్ పరిసరాల్లో పోలీసులు ఇప్పటికే పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇక అధికార టీఆర్ఎస్ తరపున గత ఎన్నికల్లో ఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చిన సైదిరెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయనను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. ఇక బీజేపీ తరపున హుజూర్ నగర్ బరిలో ఎవరు ఉండబోతున్నారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీజేపీ అభ్యర్థిగా హుజూర్ నగర్ బరిలో ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు