Home /News /politics /

ఆర్టీసీ సమ్మె... టీఆర్ఎస్ జోరు... హుజూర్‌నగర్‌పై కనిపించని ప్రభావం

ఆర్టీసీ సమ్మె... టీఆర్ఎస్ జోరు... హుజూర్‌నగర్‌పై కనిపించని ప్రభావం

కేసీఆర్, ఆర్టీసీ

కేసీఆర్, ఆర్టీసీ

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు.

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం బాగానే ఉంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో... ఆ ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఉంటుందనే ప్రచారం జరిగింది. తమ సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ ఓటమికి ఆర్టీసీ సమ్మె ప్రభావం కలిసొస్తుందని కాంగ్రెస్ కూడా బలంగానే నమ్మింది. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఆర్టీసీ సమ్మె కారణంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని భావించిన వారంతా... ఫలితాల సరళి చూసిన తరువాత ఆర్టీసీ సమ్మె ప్రభావం టీఆర్ఎస్ జైత్రయాత్రపై ఏ మాత్రం లేదనే అంచనాకు వచ్చేశారు.

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించిన టీఆర్ఎస్... పదో రౌండ్ ముగిసేసరికి 20 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. మరో 12 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండటంతో... టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తే... ఆ ప్రభావం ఆర్టీసీ సమ్మెపై ఏ రకంగా ఉంటుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, Rtc jac, Trs, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు