Huzurabad Bypoll: పోలీస్ కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్త.. హుజురాబాద్‌లో రచ్చ రచ్చ

పోలీస్ కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్త

Huzurabad Bypoll: కొందరు యువకులు రోడ్డుకు అడ్డంగా వచ్చి నినాదాలు చేశారు. వారితో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు మధ్యలో కలగజేసుకొని.. ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ రజినీకాంత్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

 • Share this:
  హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం (Huzurabad Election campaign) మొన్నటి వరకు ప్రశాంతంగానే సాగింది. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) ,కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు..ఎవరికి వారు రోడ్ షోలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఇప్పుడిప్పుడే వేడి పెరిగింది. పార్టీల మధ్య గొడవలు మొదలయ్యాయి. కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. శుక్రవారం హుజురాబాద్‌లో జరిగిన ఓ ఘటన తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రచారాన్ని టీఆర్ఎస్ వర్గాలు అడ్డుకోవడం, వారితో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కలగజేసుకున్నా టీఆర్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. అంతేకాదు విధుల్లో ఉన్న పోలీస్‌పై టీఆర్ఎస్  కార్యకర్త దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

  Huzurabad: ఓట‌రు.. ఎటువైపు? అంత‌ప‌ట్ట‌ని ప్ర‌జా నాడి.. తలలు పట్టుకుంటున్న ప్రధాన పార్టీలు

  శుక్రవారం సాయంత్రం హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడులో బీజేపీ ప్రచారం జరిగింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఐతే బీజేపీ ర్యాలీని అడ్డుకునేందుకు  టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. బొమ్మెర రామ్మూరి నేతృత్వంలో కొందరు యువకులు  రోడ్డుకు అడ్డంగా వచ్చి నినాదాలు చేశారు. వారితో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు మధ్యలో కలగజేసుకొని.. ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ రజినీకాంత్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తమకే అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ రజినీకాంత్ కాలర్‌‌ను టీఆర్ఎస్ కార్యకర్త పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  ఈ ఘటనపై అడిషనల్ డీసీసీ శ్రీనివాస్ స్పందించారు.  ప్రొబేషనరీ ఎస్ఐ రజనీకాంత్‌పై దాడికి పాల్పడ్డ ఇరువురు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  ''హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది . ఇదే సమయంలో గొడవను ఆపేందుకు వచ్చిన ఎస్ఐ రజనీకాంత్‌పై టీఆర్ఎస్ నేత ప్రవీణ్, చిన్న రాయుడు దాడి చేశారు. వారిద్దరిపై  కేసు నమోదు చేశాం. ఈ దాడిలో పాల్గొన్న మరికొందరిని గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేస్తాాం. పోలీస్ విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పపు. ''అని డీసీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు.

  Huzurabad: టీఆర్ఎస్ డప్పుకొట్టిన ఈటల.. బీజేపీ డప్పుకొట్టిన హరీష్.. అసలు  ఫొటోలు ఇవే

  బీజేపీ ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఓటమి భయంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  కాగా, హుజురాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలయింది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. అక్టోబరు 8న నామినేషన్ల దాఖలు ముగిసింది. అక్టోబరు 11న నామినేషన్లను పరిశీలించారు. అక్టోబరు 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 37 మంది హుజురాబాద్‌లో పోటీచేస్తున్నారు. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published: