Germany elections: జర్మనీ ఛాన్స్​లర్​ ఎన్నికల్లో హంగ్​.. ఏంజెలా మెర్కెల్​ పార్టీకి చుక్కెదురు

ఏంజెలా మెర్కెల్​ l: (Image: Reuters)

జర్మనీ ప్రజలు అనూహ్య ఫలితాలు ఇచ్చారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా హంగ్​ (hung) ఏర్పడేలా తీర్పునిచ్చారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు మిగతా పార్టీలవైపు చూస్తున్నాయి. ఎన్నికల వివరాలు పరిశీలిస్తే..

  • Share this:
    16 ఏళ్ళపాటు అధికారంలో వున్న తర్వాత ఈ ఎన్నికల్లో ఏంజెలా మెర్కెల్‌ (Angela Merkel) గద్దె దిగనున్నారు. దీంతో తీవ్రంగా పోటీ జరిగే అవకాశాలు వున్నాయి. 1949 తర్వాత మళ్లీ ఎన్నికవకూడదని నిర్ణయించుకున్న మొదటి చాన్సలర్‌ మెర్కెల్‌. ఎవరు గెలుస్తారనే దానితో సంబంధం లేకుండా, మెర్కెల్‌ తీసుకున్న నిర్ణయంతో సుస్థిరతకు మారుపేరుగా నిలిచిన జర్మనీ (Germany)లో మార్పు ఏ విధంగా వుంటుందో చూడాల్సి వుంది. పశ్చిమ దేశాలన్నీ చాలా ఆత్రుతగా ఈ ఎన్నికల కోసం చూస్తున్నాయి. అయితే జర్మనీ ప్రజలు అనూహ్య ఫలితాలు ఇచ్చారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా హంగ్​ (hung) ఏర్పడేలా తీర్పునిచ్చారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు మిగతా పార్టీలవైపు చూస్తున్నాయి. ఎన్నికల వివరాలు పరిశీలిస్తే..

    చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు..

    జర్మనీ ఎన్నికల్లో ఛాన్స్​లర్​ (chancellor) ఏంజెలా మెర్కెల్‌ (Angela Merkel) కు చెందిన క్రిస్టియన్​ డెమొక్రాటిక్​ యూనియన్​ (CDU) ఓట్ల వేటలో వెనుకబడింది. సోషల్‌ డెమోక్రాట్‌ పార్టీ స్వల్ప మెజారిటీ సాధించింది. మొత్తం 735 స్థానాల్లో ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి సోషల్‌ డెమోక్రాట్ల (SPD)కు 25.7% ఓట్లు (206 సీట్లు), యూనియన్‌ కూటమికి (CDU and CSU) 24.1%ఓట్లు (196 సీట్లు) పడ్డాయని ఎన్నికల అధికారులు చెప్పారు. తర్వాతి స్థానాల్లో ఉన్న గ్రీన్‌ పార్టీ (Greens) 14.8%(118 సీట్లు), ఫ్రీ డెమోక్రాట్లు (FDP) 11.5% ఓట్లు (92 సీట్లు)సాధించాయి. వైస్‌ చాన్సెలర్, ఆర్థిక మంత్రి సోషల్‌ డెమోక్రాట్‌ పార్టీ చాన్సెలర్‌ అభ్యర్థి ఒలాఫ్‌ షోల్జ్‌ ‘జర్మనీలో తాము ఒక మంచి, ఆచరణాత్మక ప్రభుత్వం (government) ఏర్పాటు చేయడానికి ఇది ప్రజలిచ్చిన తీర్పు’ అని అన్నారు. అయితే, చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని యూనియన్‌ (union) కూటమి పేర్కొంది.

    12 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వమే..

    సోషల్‌ డెమోక్రాట్లు (social democrats), యూనియన్‌ కూటమి నేతలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గ్రీన్‌ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, గ్రీన్‌ పార్టీ (green party) సోషల్‌ డెమోక్రాట్లవైపు, ఫ్రీ డెమోక్రాట్లు యూనియన్‌ కూటమి వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మాదిరిగా యూనియన్, సోషల్‌ డెమోక్రాట్లు కలిసి ‘గ్రాండ్‌ కూటమి’ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గతంలో మెర్కెల్‌ పాలనలో 12 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వమే ఉంది.

    జర్మనీ ఓటర్లకు రెండు ఓట్లు (two votes) ఉంటాయి. ఒకటి స్థానిక ఎంపీ (MP)ని ఎన్నుకునేందుకు వేసే నియోజకవర్గ ఓటు. జర్మనీలో 299 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు ప్రతి 2, 50, 000 మంది ఓటర్లకు ఒక ఎంపీ ఉంటారు. ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు గెలుచుకున్న అభ్యర్థి (candidate) ఆ స్థానంలో విజయం సాధిస్తారు. ఇక రెండో ఓటు దామాషా ప్రాతినిధ్యం పద్ధతిలో ఉంటుంది. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు (votes percentage) పడ్డాయన్న దాన్నిబట్టి మిగిలిన 299 సీట్ల (seats)ను కేటాయిస్తారు. అవి ప్రతిపార్టీ రూపొందించిన ర్యాంక్ జాబితాలోని అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇలా మొత్తం 598 సీట్లు ఉంటాయి. వీరంతా ఛాన్స్​లర్​ను ఎన్నుకుంటారు. అయితే సీట్ల బ్యాలెన్సింగ్​ కోసం సంఖ్య పెరగొచ్చు.

    సెప్టెంబర్ 26న జరిగిన ఎన్నికల్లో జర్మనీ ఓటర్లు పార్లమెంట్ దిగువ సభ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ దిగువ సభను బుండెస్టాగ్‌ అని పిలుస్తారు. దాదాపు 6 కోట్ల మంది జర్మన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుండెస్టాగ్‌లో కనీసం 598 సీట్లు ఉంటాయి. సాధారణంగా ఇంకా ఎక్కువే ఉంటాయి. గెలిచిన పార్టీ మరో రెండు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి, పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వస్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: