• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • HUGE TWIST IN THREE CAPITALS DISCUSSION IN AP LEGISLATIVE COUNCIL WAR BETWEEN TDP AND YSRCP BA

ఏపీ శాసనమండలిలో హైడ్రామా... చివరి నిమిషంలో భారీ ట్విస్ట్...

ఏపీ శాసనమండలిలో హైడ్రామా... చివరి నిమిషంలో భారీ ట్విస్ట్...

ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా హైడ్రామా నడించింది. చివరి నిమిషంలో భారీ ట్విస్ట్ ఏర్పడింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా హైడ్రామా నడించింది. చివరి నిమిషంలో భారీ ట్విస్ట్ ఏర్పడింది. ఉదయం నుంచి శాసనమండలిలో బిల్లుల మీద చర్చ జరుగుతుండగా, ప్రతిపక్ష టీడీపీ మాత్రం వాటిని సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసింది. అయితే, బిల్లులను ఆమోదించడం, లేదా తిరస్కరించాలని అధికార వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన 24 మంది మంత్రులు కూడా శాసనమండలిలోకి వచ్చి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బిల్లుల మీద చర్చ ముగిసినట్టు ప్రకటించిన సమయంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ బిల్లులపై సవరణలు ప్రతిపాదించారని, దీంతోపాటు ప్రతిపక్షం అభ్యంతరం చెబుతోంది కాబట్టి దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. అయితే, అసలు సవరణలు ఎప్పుడు ఇచ్చారని వైసీపీ తరఫున మంత్రులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు తనకు సవరణలు ఇచ్చినట్టు చైర్మన్ షరీఫ్ వెల్లడించారు. దీంతో మండలిలో రచ్చ మరింత పెరిగింది. ఓ సభ్యుడు సవరణలు ప్రతిపాదిస్తే దాన్ని సభ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని వైసీపీ నిలదీసింది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

    మరోవైపు శాసనమండలిలో హాట్ హాట్ చర్చ జరుగుతున్న సమయంలో రెండు పార్టీలకు చెందిన నేతలు గ్యాలరీలో మోహరించారు. గ్యాలరీలో ఓ వైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరికొందరు వైసీపీ నేతలు ఉండగా, మరోవైపు చంద్రబాబు, బాలకృష్ణ మరికొందరు టీడీపీ నేతలు మోహరించారు. రెండు పార్టీల నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు