Home /News /politics /

HUGE RIFT BETWEEN VIJAYAWADA TDP LEADERS AS BUDHA VENKANNA AND BONDA UMA SLAMS MP KESINENI NANI HERE ARE FULL DETAILS PRN

Telugu Desham Party: బెజవాడ టీడీపీలో చల్లారని వేడి.. చంద్రబాబుకు తెలిసే జరుగుతోందా..?

కేశినేని నాని, బుద్ధా వెంకన్న (ఫైల్)

కేశినేని నాని, బుద్ధా వెంకన్న (ఫైల్)

విజయవాడ రాజకీయాలు (Vijayawada Politics) ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ముఖ్యంగా తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.

  విజయవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ముఖ్యంగా తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ముఖ్యంగా మేయర్ అభ్యర్థిత్వం రేపిన చిచ్చు తీవ్రరూపం దాల్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, సీనియర్ నేత నాగుల్ మీరా తిరుగుబాటుకు దిగారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా బుద్ధా వెంకన్న కేశినేని నానిపై విరుచుకుపట్టారు. కులం ఓట్ల గురించి కేశినేని దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ మేయర్ అభ్యర్థి మావాడని.. అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారన్నారు. నీ కులం ఓట్లే నీకు పడవన్న బుద్ధ వెంకన్న.. చంద్రబాబు పెట్టిన బిక్షతో ఎంపీగా గెలిచావన్నారు.

  నువ్వు తోపువైతే ఏ సెంటర్లోనైనాన తేల్చుకుందామంటూ కేశినేని నానికి సవాల్ విసిరారు బుద్ధా వెంకన్న. ప్రజారాజ్యం పార్టీని నాశనం చేసిన కేశినేని నాని.. ఇప్పుడు టీడీపీని కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. పార్టీ ఆఫీసులో కోవర్టులను పెట్టుకొని చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించలేదంటూ దుర్గగుడిలో ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని.. చంద్రబాబు ఆశీస్సులతోనే బరిలో దిగుతానన్నారు.

  ఇది చదవండి: తిరుపతిలో బెజవాడ రాజకీయం పనిచేస్తుందా...? వైసీపీకి ఆయన చెక్ పెడతారా..?  ఇక మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే కేశినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా గెలవాలని సవాల్ విసిరారు. కేశినేని నాని ఇండిపెండెంట్ గా గెలిస్తే తాను రాజకీయాలే కాదు.. విజయవాడ వదిలి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మాపై కేశినేని నాని పెత్తనమేంటని మరో సీనియర్ నేత నాగుల్ మీరా ప్రశ్నించారు. సైకిల్ గుర్తు లేకుండానే నీకు ఓటు వేశారా..? వన్ టౌన్ లో చంద్రబాబు టూర్ పై మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. కేశినేని నాని అహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని నాగుల్ మీరా అన్నారు.

  మొత్తానికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదవుల కోసం కొట్లాటలు ఉండటం సహజం. కానీ టీడీపీలో మాత్రం మేయర్ అభ్యర్థిత్వం పెట్టిన చిచ్చు.. పాత గొడవలను కూడా రేపింది. ఈ ప్రభావం కచ్చితంగా కార్పొరేషన్ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మొత్తానికి బెజవాడ టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకునే స్థాయికి వచ్చాయి. ఈ విభేదాలకు చంద్రబాబు ఏవిధంగా చెక్ పెడతారనేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bonda uma, Buddha venkanna, Kesineni Nani, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు