• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • HUGE POLLING PERCENTAGE RECORDED IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS PHASE 1 HERE ARE THE DETAILS PRN

AP Pachayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్.., ఆ జిల్లా ఓటర్లే టాప్..

AP Pachayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్.., ఆ జిల్లా ఓటర్లే టాప్..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో 81శాతం పోలింగ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) తొలివిడత పోలింగ్ పూర్తైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్ పూర్తైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొదటివిడత ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 81.09 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది... వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 75.41 శాతం పోలింగ్ నమోదైంది.

    జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి

    • శ్రీకాకుళం జిల్లా – 77.04 శాతం

    • విశాఖపట్నం జిల్లా – 82.86 శాతం

    • తూర్పుగోదావరి జిల్లా – 82.80 శాతం

    • పశ్చిమగోదావరి జిల్లా 80.29 శాతం

    • కృష్ణా జిల్లా - 85.06 శాతం

    • గుంటూరు జిల్లా – 83.04 శాతం

    • ప్రకాశం జిల్లా – 75.41 శాతం

    • నెల్లూరు జిల్లా – 80.62 శాతం

    • చిత్తూరు జిల్లా – 83.47 శాతం

    • కడప జిల్లా – 76.63 శాతం

    • కర్నూలు జిల్లా – 83.55 శాతం

    • అనంతపురం జిల్లా – 82.30 శాతం


    ఇది చదవండి: ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్టు షాక్... e-Watch appపై మరో వారం స్టే



    మరోవైపు ఇఫ్పటివరకు విడుదలైన ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక్యత కనబరిచింది. తొలుత ఏకగ్రీవాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.

    జిల్లాల వారీగా వెలువడిన ఫలితాలు

    • శ్రీకాకుళం(321): వైసీపీ మద్దతుదారులు - 39, టీడీపీ మద్దతుదారులు - 0

    • విశాఖపట్నం (340): వైసీపీ మద్దతుదారులు- 42, టీడీపీ మద్దతుదారులు- 1, ఇతరులు - 1

    • తూర్పుగోదావరి (366): వైసీపీ మద్దతుదారులు 29, టీడీపీ మద్దతుదారులు-0, ఇతరులు 1

    • పశ్చిమగోదావరి (239): వైసీపీ మద్దతుదారులు- 38, టీడీపీ మద్దతుదారులు-0, ఇతరులు 3

    • కృష్ణా (234): వైసీపీ మద్దతుదారులు - 21, టీడీపీ మద్దతుదారులు -2

    • గుంటూరు(337): వైసీపీ మద్దతుదారులు-65, టీడీపీ మద్దతుదారులు-2

    • ప్రకాశం(227): వైసీపీ మద్దతుదారులు - 31, టీడీపీ మద్దతుదారులు-4, ఇతరులు 0

    • నెల్లూరు జిల్లా (163): వైసీపీ మద్దతుదారులు - 22, టీడీపీ మద్దతుదారులు -2, ఇతరులు - 1

    • కడప జిల్లా (206): వైసీపీ మద్దతుదారులు - 51, టీడీపీ మద్దతుదారులు 0, ఇతరులు 0

    • అనంతపురం(169): వైసీపీ మద్దతుదారులు - 6, టీడీపీ మద్దతుదారులు - 0

    • చిత్తూరు (454): వైసీపీ మద్దతుదారులు - 106, టీడీపీ మద్దతుదారుల - 6

    • కర్నూలు(193): వైసీపీ మద్దతుదారులు - 50, టీడీపీ మద్దతుదారులు - 1, ఇతరులు – 1

    Published by:Purna Chandra
    First published: