CID Notice to Chandrababu: ఆ 500 ఎకరాలే కీలకం.., చంద్రబాబు అంతపెద్ద తప్పు చేశారా..?

చంద్రబాబు - నారా లోకేష్ (ఫైల్)

Amaravati Lands: రాజధాని ప్రకటన సమయంలో అక్రమంగా బదలాయింపుకు జరిగిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ చేర్చడంతో పాటు వాటికి సాధారణ భూములకు ఇచ్చే పరిహారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 23న ఆయన విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. ఐతే గతంలో వచ్చిన ఇన్ సైడర్ ట్రైడింగ్ కేసు కాకుండా.. కొత్తగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి.

    చంద్రబాబుకు సీఐడీ నోటీసుల వ్యవహారం అంతా 500 ఎకరాల చుట్టూనే తిరుగుతోంది. రాజధాని ప్రకటనకు ముందు అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలల అసెన్డ్ భూములు నిబంధనలకు విరుద్ధంగా చేతులుమారినట్లు ప్రభుత్వం గుర్తించింది. దళితులు, ఇతర లబ్ధిదారులకు చెందిన భూమలును కొందరు వ్యక్తులు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వదని.. అంతకంటే ఎక్కువ సొమ్ము తాము చెల్లిస్తామని కొందరు వ్యక్తులు పేదల దగ్గర భూములు కొనుగోలు చేశారు.

    ఇది చదవండి: చంద్రబాబుకు జగన్ ప్రభుత్వం ఊహించని షాక్.., సీఐడీ నోటీసులు జారీ



    రాజధాని ప్రకటన సమయంలో అక్రమంగా బదలాయింపుకు జరిగిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ చేర్చడంతో పాటు వాటికి సాధారణ భూములకు ఇచ్చే పరిహారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ అనుమతి లేకుండానే జీవో జారీ చేసినట్లు ఆరోపలున్నాయి. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పేదల దగ్గర అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ లో అత్యధిక ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వ విచారణలో వెల్లడైంది. ఇలా ప్రయోజనం పొందినవారు ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది.

    ముఖ్యంగా కొల్లి శివరాం అనే వ్యక్తి ఏకంగా 47.39 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఆ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి అప్పగించి ప్లాట్లు పొందారు. అలాగే గుమ్మడి సురేష్ అనే వ్యక్తి 42.92 ఎకరాలు, బలుసు శ్రీనివాసరావు అనే వ్యక్తి 14.07 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం 338.88 ఎకరాల అసైన్డ్ భూమలును అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ భూములను ప్రభుత్వానికి ఇచ్చి ఫ్లాట్లు పొందినట్లు వెల్లడైంది.  ఈ కేసులో అప్పడి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. త్వరలోనే మరికొంతమందిని సీఐడీ విచారించనుంది.
    Published by:Purna Chandra
    First published: