హుజూర్ నగర్ ఫలితం... కోట్లలో బెట్టింగ్ ?

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 10 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరిగినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 24, 2019, 10:21 AM IST
హుజూర్ నగర్ ఫలితం... కోట్లలో బెట్టింగ్ ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంపై క్లారిటీ వచ్చింది. టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే విషయం దాదాపుగా తేలిపోయింది. ఇప్పటికే 15 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న టీఆర్ఎస్...ఫలితాలు పూర్తయ్యే సమయానికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికపై బెట్టింగ్ బాబులు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్కంఠ నెలకొన్న ఈ అసెంబ్లీ ఎణ్నికల ఫలితాలపై ఇప్టపికే నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు బెట్టింగ్‌లు కాసినట్టు సమాచారం. విజయం మీదే కాకుండా మెజార్టీ మీద కూడా పందేలు జోరందుకున్నాయి. ఏ పార్టీ నేతలు ఆ పార్టీ నేతలతో బెట్టింగ్ కాస్తున్నారు.

కొందరు ఇతర పార్టీ నేతలతో కూడా బెట్టింగ్‌లకు దిగినట్టు సమాచారం. ప్రధాన పార్టీలపైనే ఈ పందేలు నడుస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్లకు పైగానే బెట్టింగ్ నడుస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ నెల 21న జరిగిన పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆధారంగా కొందరు బెట్టింగ్‌కు దిగితే... గత అనుభవాలను దృష్టిలో పెట్టకుని కొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు మరి కొందరు ఇలా అభ్యర్థుల కన్నా బెట్టింగ్ రాజాలకు ఫలితంపై ఆసక్తి ఎక్కువగా ఉంది.
Published by: Kishore Akkaladevi
First published: October 24, 2019, 10:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading