పౌరసత్వ సవరణ బిల్లు : ముస్లింలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై నేడు లోక్‌సభలో వాడి వేడి చర్చ జరుగుతోంది.చర్చ సందర్భంగా విపక్షాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.

news18-telugu
Updated: December 11, 2019, 4:35 PM IST
పౌరసత్వ సవరణ బిల్లు : ముస్లింలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
అమిత్ షా (File Photo)
  • Share this:
లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై నేడు లోక్‌సభలో వాడి వేడి చర్చ జరుగుతోంది.చర్చ సందర్భంగా విపక్షాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించాయి.అక్రమ వలసదారులుగా తేలినవాళ్లలో క్రైస్తవులు,బౌద్దులు,హిందువులు, సిక్కులు,పార్శీలకు పౌరసత్వం కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ జాబితాలో ముస్లింలను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. విపక్షాల ప్రశ్నలపై అమిత్ షా తనదైన శైలిలో బదులిచ్చారు. చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం అన్న ఆరోపణలను ఆయన ఖండించారు.

పొరుగు దేశాల నుంచి వలసొచ్చిన ఎవరికైనా పౌరసత్వం కల్పించాలని కొంతమంది వాదిస్తున్నారు.పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్.. పొరుగున ఉన్న ఈ మూడు దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలు.వారి రాజ్యాంగంలో ఇస్లాం విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించాలని కొంతమంది చెబుతున్నారు. అలాగైతే ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చిన ముస్లింలకైనా మనమే ఆశ్రయం కల్పించాలా? ఇదెలా కుదురుతుంది. అలా అయితే దేశం ఎలా పనిచేస్తుంది.?
అమిత్ షా,కేంద్ర హోంమంత్రి


పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు.భారతీయ ముస్లింలకు భద్రత ఉంటుందని.. ఎప్పటికీ అదే భద్రత కొనసాగుతుందని స్పష్టం చేశారు.అభద్రతా భావంలో బతకాల్సిన అవసరం లేదని.. తప్పుడు సమాచారాలను పట్టించుకోవద్దని చెప్పారు.

First published: December 11, 2019, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading