Home /News /politics /

HOW RAHUL HANDLED TRICKY SIDHU VS CHANNI ANNOUNCEMENT PVN

Punjab Polls : రాహుల్ అంతమాట అన్నారేంటీ..సిద్దూ కాంగ్రెస్ లో కొనసాగడం కష్టమే?

సిద్ధూ, రాహుల్, చన్నీ (Image: PTI)

సిద్ధూ, రాహుల్, చన్నీ (Image: PTI)

Rahul Anounce Punjab Congress CM Candidate :  పార్టీకి "నాయకులను అభివృద్ధి చేసే వ్యవస్థ" ఉందని నొక్కి చెప్పిన రాహుల్... బీజేపీలో 13 సంవత్సరాలు ఉండి 2017 పంజాబ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధూకు పరోక్షంగా పార్టీకి నువ్వే దిక్కు కాదు,నువ్వు లేకుంటే పంజాబ్ లో కాంగ్రెస్ లేదు అనే ఫీలింగ్ లో ఉండకు అనే సంకేతాన్నిచ్చారు.

ఇంకా చదవండి ...
Rahul Anounce Punjab Congress CM Candidate :   మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. అయితే పంజాబ్ లో అధికార కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థి ఎవరనే అంశం కొద్ది రోజులుగా హాట్ టాపిక్. దీనికి కారణం పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్సెస్ ఇతర నేతలలా మారిన పరిస్థితి. తానే సీఎం అభ్యర్థి అని నిన్నటి వరకు నవజ్యోత్ సిద్ధూ ఫీల్ అయిపోయారు. ఈ క్రమంలో సొంత ప్రభుత్వంపైన,సీఎం చన్నీపై తీవ్రమైన విమర్శల దాడి కూడా చేశారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ (Congress)పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చరణ్‌ జిత్ సింగ్ చన్నీ(ప్రస్తుత పంజాబ్ సీఎం)ని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూను ప‌క్క‌కు పెట్టి చ‌న్నీని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా కాంగ్రెస్ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

"రాజకీయ నాయకులు 10-15 రోజుల్లో పుట్టరు. టీవీ డిబేట్స్ లో పాల్గొనడం ద్వారా నాయకులు తయారు చేయబడరు" అని రాహుల్ గాంధీ ఆదివారం లూథియానాలో జరిగిన వర్చువల్ ర్యాలీలో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు అన్నారు. అయితే చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించం వెనుక నిర్ణయం తనది కాదని రాహుల్ స్పష్టం చేశారు.. పంజాబ్ ప్రజలు, యువత, కార్యవర్గ సభ్యులను వారి అభిప్రాయాలను తాను అడిగి తెలుసుకున్నానని పేదలను అర్థం చేసుకోగల వ్యక్తి మాకు అవసరమని పంజాబీలు తనకు చెప్పారని రాహుల్ అన్నారు. తనకు సీఎం అభ్యర్థి విషయంలో వేరొక అభిప్రాయం ఉండవచ్చు కానీ తనకంటే ప్రజల అభిప్రాయమే ముఖ్యమని రాహుల్ సృష్టం చేశారు.

ALSO READ Assembly Elections 2022: కాంగ్రెస్ రాత‌ను చన్నీ మారుస్తారా.. పంజాబ్‌లో పార్టీ ప‌రిస్థితి ఏంటీ?

పార్టీకి "నాయకులను అభివృద్ధి చేసే వ్యవస్థ" ఉందని నొక్కి చెప్పిన రాహుల్... బీజేపీలో 13 సంవత్సరాలు ఉండి 2017 పంజాబ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధూకు పరోక్షంగా పార్టీకి నువ్వే దిక్కు కాదు,నువ్వు లేకుంటే పంజాబ్ లో కాంగ్రెస్ లేదు అనే ఫీలింగ్ లో ఉండకు అనే సంకేతాన్నిచ్చారు. తాను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, గత ఏడేళ్లుగా రాజకీయంలో నేర్చుకున్నంత అంతకుముందెప్పుడూ నేర్చుకోలేదు. రాజకీయం అంటే సులువైన పని అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. రాజకీయాల్లో చాలా మంది కామెంటేటర్స్ ఉంటారు. కానీ ఓ నాయకుడిని తయారు చేయడం సులభం కాదు అని రాహుల్ గాంధీ అన్నారు.

చరణ్‌ జిత్ సింగ్ చన్నీ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ. అతనికి పేదరికం తెలుసు. అతనిలో ఏమైనా అహంకారం కనిపించిందా? వెళ్లి ప్రజలను కలుస్తుంటాడు..పేదల గొంతుక చన్నీ అని రాహుల్ అన్నారు. చన్నీ మరియు బీజేపీకి చెందిన ఇద్దరు పెద్ద ప్రచారకర్తల మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ... "మోదీ జీ ప్రధాని, యోగీ జీ ముఖ్యమంత్రి. ప్రధాని వెళ్లి ప్రజలను కలవడం మీరు చూశారా? ప్రధాని ఎవరికైనా సహాయం చేయడం మీరు చూశారా? ప్రధానమంత్రి మోడీ ఒక రాజా (రాజు), అతను ఎవరికీ సహాయం చేయడు"అని విమర్శించారు.

ALSO READ Punjab Polls : ఆ నియోజకవర్గం హాట్ టాపిక్..నిందితుడైన ఎమ్మెల్యే vs రేప్ కేసు అడ్వకేట్

సిద్ధూ విషయానికొస్తే, "అతను ఎమోషనల్‌గా ఉన్నాడని,అయితే ఏంటని రాహుల్ ప్రశ్నించారు. ఇక, రాహుల్ గాంధీ నిర్ణయాన్ని తాను ఇప్పటికే అంగీకరించాను అని తన ప్రసంగంలో అంగీకరించిన సిద్ధూ "మీరు నాకు నిర్ణయాధికారం ఇవ్వకపోయినా, తదుపరి ముఖ్యమంత్రికి నేను మద్దతు ఇస్తాను" అని అన్నారు. తాను పంజాబ్ సంక్షేమాన్ని మాత్రమే కోరుతున్నానన్న సిద్ధూ ..తనను ఓ షోపీస్ లాగా చూడకండని అన్నారు.

మరోవైపు,సీఎం అభ్యర్థిని రాహుల్ ప్రకటించే సమయంలో స్టేజీపై కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. రాహుల్ గాంధీ చన్నీ పేరు ప్రకటించిన వెంటనే సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తి అభ్యర్థి ఎంపిక విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నిరూపించాడు. ఆ క్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేస్తూ.."సిద్ధూజీ, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి.. మీ మోడల్‌ అమలు అయి తీరుతుంది" అని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: 5 State Elections, Congress, Navjot Singh Sidhu, Punjab, Rahul Gandhi

తదుపరి వార్తలు