నామినేషన్‌కు కొద్ది గంటల ముందు ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు.. ఆ స్పీచ్ వల్లే..

ప్రకాష్ రాజ్ పాల్గొన్న ఆ కార్యక్రమంలో పలువురు ప్రముఖ రచయితలు, నటీనటులు, సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ స్పీచ్‌ను సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన కొంతమంది ఆహ్వానితులు.. దాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు షేర్ చేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 29, 2019, 8:12 PM IST
నామినేషన్‌కు కొద్ది గంటల ముందు ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు.. ఆ స్పీచ్ వల్లే..
ప్రకాష్ రాజ్ (File)
news18-telugu
Updated: March 29, 2019, 8:12 PM IST
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై కర్ణాటక ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నప్రకాష్ రాజ్.. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేశారు. మరికొద్ది గంటల్లో ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దపడుతున్న తరుణంలో.. ఈ కేసు నమోదవడం గమనార్హం.మార్చి 12న మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రకాష్ రాజ్ పొలిటికల్ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

నిజానికి ఆ కార్యక్రమం మీడియా&భావ ప్రకటన స్వేచ్చకు సంబంధించినది కాగా.. ఆ వేదికగా ప్రకాష్ రాజ్ పొలిటికల్ కామెంట్స్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ స్పీచ్‌ను సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన కొంతమంది ఆహ్వానితులు.. దాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు షేర్ చేసినట్టు తెలుస్తోంది.దీంతో మూర్తి అనే ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ తన టీమ్‌తో కలిసి వెంటనే అక్కడికి రాగా.. అప్పటికే కార్యక్రమం పూర్తయిపోయి ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. దీంతో ఆ వీడియో ఆధారంగా సదరు అధికారి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ రాజ్‌‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాష్‌రాజ్‌తో పాటు కార్యక్రమ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు.

First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...