#AmitShahToNews18 : అయోధ్య వివాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

#AmitShahToNews18 : అయోధ్య తీర్పుపై స్పందించాలని నెట్‌వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషి కోరగా.. అమిత్ షా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సుప్రీం తీర్పుతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తాను భావిస్తున్నానని, అన్ని వర్గాలు దాన్ని అంగీకరిస్తారని అన్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 12:33 PM IST
#AmitShahToNews18 : అయోధ్య వివాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
నెట్‌వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
news18-telugu
Updated: October 17, 2019, 12:33 PM IST
అయోధ్య రామ్ మందిర్ తీర్పుపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దశాబ్దాలుగా కొనసాగిన ఈ కేసులో వాదనలు నిన్న ముగిశాయి. దాదాపు 40 రోజుల పాటు ఇరు వర్గాల మధ్య వాదనలు సాగాయి. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వాదనలు విని, తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ కేసులో నవంబరు 17లోగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, అయోధ్య తీర్పుపై స్పందించాలని నెట్‌వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషి కోరగా.. అమిత్ షా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సుప్రీం తీర్పుతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తాను భావిస్తున్నానని, అన్ని వర్గాలు దాన్ని అంగీకరిస్తారని అన్నారు.

సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పును తాము గౌరవిస్తామని అమిత్ షా తెలిపారు. హిందూ వర్గానికి అనుకూలంగా వస్తే.. అని అడగ్గా.. అన్ని వర్గాలు ఆమోదించేలా న్యాయమూర్తి తీర్పు ఇస్తారని తాను భావిస్తున్నానని చెప్పారు. మథుర, కాశీలోనూ వివాదం నడుస్తోంది, దాని సంగతేంటని అడగ్గా.. అన్ని తీర్పులను ఒకేలా చూడొద్దని, అయితే.. పలు ప్రశ్నలకు సమాధానం ఈ తీర్పుతో వస్తుందని అన్నారు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...