Home /News /politics /

HOPE CM JAGAN WILL KEEP HIS PROMISE OF KEEPING NTR NAME TO KRISHNA DISTRICT BA

సీఎం జగన్ మాట తప్పడనుకుంటున్నా.. లక్ష్మీపార్వతి

వైఎస్ జగన్, సీనియర్ ఎన్టీఆర్, నందమూరి లక్ష్మీపార్వతి

వైఎస్ జగన్, సీనియర్ ఎన్టీఆర్, నందమూరి లక్ష్మీపార్వతి

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. దానికి సంబంధించి సీఎం జగన్‌కు త్వరలో అప్లికేషన్ ఇస్తానన్నారు.

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నందమూరి లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మీపార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఇంకా తన రెండు కోరికలు నెరవేరాల్సి ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. దానికి సంబంధించి సీఎం జగన్‌కు త్వరలో అప్లికేషన్ ఇస్తానన్నారు. ఆ విషయంలో జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా తన మాట నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషి చేయాలని సీఎం జగన్‌కు లేఖ రాస్తానని లక్ష్మీపార్వతి తెలిపారు. జగన్ ఐదు నెలల పాలనకు 60 నుంచి 70 మార్కులు ఇవ్వొచ్చన్నారు. మే 30న ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. తాను ఎప్పుడూ ఎన్టీఆర్ పాలనను జగన్‌తో పోల్చి చూడనన్నారు. కానీ, వైఎస్ పాలనతో పోల్చి చూస్తానని చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP Politics, Lakshmi Parvathi, NTR

    తదుపరి వార్తలు