HONEY BEES ATTACK IN MINISTER ANIL KUMAR TOUR IN KURNOOL SK
మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి.. ఎమ్మెల్యేకు గాయాలు
మంత్రి అనిల్ కుమార్
గాలేరు నగరి కాల్వ గేట్లను పరిశీలిచేందుకు వెళ్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆ సమయంలో మెట్లపై ఉన్న మంత్రి అనిల్ కుమార్ వెంటనే కిందకు దిగి బయటకు వచ్చేశారు. ఈ ఘటనతో మంత్రి పర్యటన అర్థంతరంగా ముగిసింది.
మంత్రి అనిల్ కుమార్ కర్నూల్ పర్యటనలో కలకలం రేగింది. పాములపాడు మండలం బానకచర్ల నీటి సముదాయాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి అనిల్, నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఆర్థర్ సహా పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దాంతో స్థానికులు, జర్నలిస్టులు భయంతో పరుగులు పెట్టారు. పర్యటనలో భాగంగా మంత్రుల బృందం తెలుగు గంగ, కేసీ ఎస్కేప్ కాలువలను పరిశీలించింది. అనంతరం గాలేరు నగరి కాల్వ గేట్లను పరిశీలిచేందుకు వెళ్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆ సమయంలో మెట్లపై ఉన్న మంత్రి అనిల్ కుమార్ వెంటనే కిందకు దిగి బయటకు వచ్చేశారు. ఈ ఘటనతో మంత్రి పర్యటన అర్థంతరంగా ముగిసింది. ఎమ్మెల్యేలంతా భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.